‘MBA Chaiwala’ : అప్పుడు టీ వ్యాపారి, ఇప్పుడు లక్షాధికారి..ఎలా అయ్యాడు ?

ఇండియాలోనే టాప్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేసిన ప్రఫూల్ ఇప్పుడు లక్షాధికారి అయ్యాడు.

‘MBA Chaiwala’ : అప్పుడు టీ వ్యాపారి, ఇప్పుడు లక్షాధికారి..ఎలా అయ్యాడు ?

'mba Chaiwala

Selling Tea : ఇండియాలోనే టాప్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేసిన ప్రఫూల్ ఇప్పుడు లక్షాధికారి అయ్యాడు. టీ కొట్టు ద్వారా..భారతదేశంలో ఫుల్ ఫేమస్ అయ్యాడు ఇతను. ఇప్పుడు ఎంబీఏ చాయ్ వాలాగా క్రేజ్ సంపాదించాడు. జీవితంలో ఏదైనా చేయొచ్చు అని నిరూపిస్తున్నాడు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రఫూల్. అహ్మాదాబాద్ లో నివాసం ఉంటున్నాడు ఇతను. మరి అతను ఎలా లక్షాధికారి అయ్యాడు. మధ్యలో అతను పడిన సమస్యలు ఏంటీ తెలుసుకుందాం.

ప్రఫూల్ ను ప్రస్తుతం ఎంబీఏ చాయ్ వాలా అని పిలుస్తుంటారు. CATలో సరైన స్కోర్ చేయలేకపోవడం వల్ల…స్టడీస్ ను మధ్యలోనే వదిలేయాలని అనుకున్నాడు. చివరకు వీధిలో చాయ్ అమ్ముకోవాలని డిసైడ్ అయ్యాడు. అహ్మాదాబాద్ లో ఎంబీఏ చదువుతున్న సమయంలో పార్ట్ టైం కింద..రెస్టారెంట్ లో జాబ్ పనిచేశాడు. ఇది అతనికి కలిసి వచ్చింది. ఓ టీ దుకాణ యజమానితో మాట్లాడిన తర్వాత..ఇదే బిజినెస్ కరెక్టు అనుకుని ఈ బిజినెస్ లోకి దిగాడు. అయితే..ఇందులో అనుభవం లేకపోవడంతో సమస్యలు ఎదురయ్యాయి. పాలను పాడు చేయడం, చక్కెరను ఎక్కువగా కలపడంతో రోజంతా.. ఒక్క టీ మాత్రమే విక్రయించగలిగాడు. రోజు రోజు..టీ పెట్టడంలో మెళుకవ సంపాదించుకున్నాడు.

M Ba

కొన్ని నెలల్లోనే షాపు బాగా నడవడం ప్రారంభమైంది. నెలకు రూ. 15 వేల వరకు సంపాదించేవాడు. ఈ వ్యాపారాన్ని అతని తల్లిదండ్రులు ఇష్టపడలేదు. ఇక ఎంబీఏను వదిలేశాడు. ఈ వ్యాపారంలో పైకి ఎదగడానికి ప్రఫూల్ చాలానే కష్టపడ్డాడు. క్యాట్ లో సరైన స్కోరు సాధించకలేక పోయినందుకు చాలా బాధ పడ్డానని, డిగ్రీ చేయాలని తన తల్లిదండ్రులు కోరుకున్నారని ప్రఫూల్ వెల్లడించాడు. 20 ఏళ్ల వయస్సులో పొదుపు చేయడం, కష్టపడడం అలవాటు చేసుకున్నట్లు తెలిపాడు. అహ్మాదాబాద్ చేరుకున్న తర్వాత..తన కాళ్ల మీద తాను నిలబడాలని అనుకున్నట్లు, రెస్టారెంట్ లో పార్ట్ టైం జాబ్ చేసినట్లు వెల్లడించారు. స్థానికంగా ఉన్న ఎంబీఏ కాలేజీలో చేరి నిజాయితీగా నేర్చుకున్నానన్నారు.

ఈ సమయంలోనే తన సొంతంగా వ్యాపారం ప్రారంభించుకోవాలని అనుకున్నట్లు, కానీ..అప్పుడు అంతగా డబ్బు లేదన్నారు. టీ వ్యాపారితో మాట్లాడిన అనంతరం ఈ బిజినెస్ ప్రారంభించాలని అనుకుని..patila, lighter, chalni కొన్నట్లు తెలిపారు. ఎంబీఏ వదిలేసిన అనంతరం..టీ వ్యాపారం ప్రారంభించినట్లు ప్రఫూల్ తెలిపారు. కుటుంబానికి సిగ్గు తెస్తున్నాడంటూ..ఎంతో మంది అన్నారు. స్నేహితులు కూడా ఎగతాళి చేశారు. ఫిబ్రవరి 14వ తేదీ వాలెంటైన్స్ డేను చక్కగా ఉపయోగించుకోవాలని ప్రఫూల్ నిర్ణయం తీసుకున్నాడు. తన ఫేస్ బుక్ అకౌంట్ లో వాలంటైన్స్ డే కోసం ఈవెంట్ క్రియేట్ చేశాడు. ఇందులో సింగిల్స్ కు మాత్రమే తన కేఫ్ లో ఫ్రీగా చాయ్ ఆఫర్ చేస్తున్నాడు. ఈ కేఫ్ రాత్రి 7 నుంచి రాత్రి 10 గంటల వరకు ఓపెన్ గా ఉంటుంది. ‘‘వాలంటైన్స్ డే రోజున ప్రేమ జంటలే ఎందుకు ఎంజాయ్ చేయాలి. సింగిల్స్ కూడా ఎంజాయ్ చేయాలి.

chaiwala

ఈ ఏడాది వాలంటైన్స్ డే రోజున సింగిల్స్ అందరికి ఫ్రీ గా చాయ్ సర్వ్ చేయనున్నాం’’ అని ఫేస్ బుక్ డిస్ర్కప్షన్ పేజీలో పెట్టాడు. ఆ రోజంతా సింగిల్స్ గా ఉన్నవారు బోరుగా ఫీల్ అవుతుంటారు. అందుకే సింగిల్స్ కోసం తన కేఫ్ లో ఫ్రీ గా చాయ్ సర్వ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. ఇలా తన కేఫ్ కు సింగిల్స్ ను ఇన్వైట్ చేసి ఫ్రీ చాయ్ సర్వ్ చేయడం వల్ల బిజినెస్ తో పాటు మంచి గుడ్ ఫీల్ ఉంటుందని ప్రఫూల్ భావిస్తున్నాడు. కేఫ్ లో మగ్గీ, బన్ మస్కా; బ్రెడ్ బట్టర్, శాండ్ విచ్, ఫ్రెంచ్ ఫ్రై, స్నాక్ ఇలా 35 రకాల వెరైటీలు సర్వ్ చేస్తున్నాడు.

2 సంవత్సరాల అనంతరం ప్రఫూల్ సొంతంగా కేఫ్ ను తెరిచాడు. దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఫ్రాంచైజీలు కలిగి ఉన్నాడు. పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించాలని ఇతనికి ఆహ్వానాలు అందాయి. తనను ఎగతాళి చేసిన వ్యక్తులు ఇప్పుడు సలహాలు తీసుకోవడానికి వస్తుంటారన్నారు. నేను చేసిన పనిని ప్రేమిస్తున్నట్లు, పూర్తి సమయం దీనికే కేటాయించినట్లు ప్రఫూల్ వెల్లడించాడు.