సెకండ్ డోసేజ్ తర్వాత మళ్లీ కరోనా పాజిటివ్

సెకండ్ డోసేజ్ తర్వాత మళ్లీ కరోనా పాజిటివ్

Corona Positive After 2nd Dose: కరోనా సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత ఓ ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ కొవిడ్ పాజిటివ్ వచ్చింది. రెండో డోస్ తీసుకున్న కొద్ది రోజులకే పాజిటివ్ రావడం గమనార్హం. దీనిపై స్పందించిన డాక్టర్లు శరీరంలో ఇమ్యూనిటీ డెవలప్ అవడానికి ఇంకొద్ది రోజులు పడుతుందంటున్నారు.

21ఏళ్ల వ్యక్తి గతవారం కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. అది అతనికి రెండో డోస్. వైరల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్టుకు వెళ్లాడు. అక్కడ అతని పాజిటివ్ అని తేలింది. శనివారం రాత్రి సెవన్ హిల్స్ హాస్పిటల్ లో చేర్పించారు. అతనితో పాటు వ్యాక్సిన్ వేసుకున్న మరి కొంతమంది ప్రెండ్స్ ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నట్లు సమామాచారం

వ్యాక్సిన్ వేసుకున్న ప్రతి ఒ్కరికీ ఒకేసారి యాంటీబాడీలు ప్రొడ్యూస్ అవుతాయని లేదు. వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే.. నిర్లక్ష్యంతో కొవిడ్ నిబంధనలు పాటించకపోతే ప్రమాదం. దాదాపు ఒక 45రోజుల సమయం తర్వాత ఇమ్యూన్ రెస్పాన్స్ పెరుగుతుంది. ఆ స్టూడెంట్ లో చాలా తక్కువ స్థాయి లక్షణాలు మాత్రమే కనిపించాయి.

కొన్ని చోట్ల వ్యాక్సినేషన్ చేయడానికి వెళ్లిన హెల్త్ కేర్ వర్కర్లకు కూడా కరోనా పాజిటివ్ వస్తుంది. అంటే వ్యాక్సినేషన్ జరిగిన కొంత కాలం తర్వాత ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. అందుకే వారికి కూడా కొవిడ్ సేఫ్టీ ప్రొటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని చెప్తున్నామని నిపుణులు అంటున్నారు. మరోవైపు ఆ స్టూడెంట్ కు కరోనా పాజిటివ్ రావడంతో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ దగ్గరపడుతున్న సమయంలో.. ఇలా జరగడం ఐసోలేషన్ లేదా క్వారంటైనో ఉండిపోవడం ఎగ్జామ్స్ కు అటెండ్ అవుతానో లేదో అనే గందరగోళానికి గురవుతున్నాడు.