Aam Aadmi Party: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ‘ఆప్’దే హవా.. 15 ఏళ్ల బీజేపీ ఆధిపత్యానికి చెక్

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించబోతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. గత 15 ఏళ్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి ప్రతిపక్షానికే పరిమితమయ్యే అవకాశం ఉంది.

Aam Aadmi Party: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ‘ఆప్’దే హవా.. 15 ఏళ్ల బీజేపీ ఆధిపత్యానికి చెక్

Aam Aadmi Party: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించబోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. పదిహేనేళ్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ఇకపై ప్రతిపక్షానికే పరిమితం కానుందని అంచనాలు మొదలయ్యాయి. తాజా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం… 250 సీట్లు ఉన్న మున్సిపాలిటీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం దక్కించుకుంటుంది.

CM KCR-Revanth Reddy : కేసీఆర్‌కు ఆ పాపం ఊరికేపోదు .. దానికి ఫలితమే కూతురుకి ఏసీబీ నోటీసులు : రేవంత్ రెడ్డి

ఈ పార్టీ 155 సీట్ల వరకు దక్కించుకునే అవకాశం ఉంది. అన్ని సర్వేలు ‘ఆప్’కు అనుకూలంగానే ఉన్నాయి. వివిధ సర్వేల్లో ఆ పార్టీ కనీసం 145 సీట్లు పైగా గెలుచుకుటుందని తేలింది. బీజేపీకి 69-91 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. దీంతో బీజేపీకి ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం 10 సీట్లకే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇతర పార్టీలు, స్వతంత్రులకు 5-9 సీట్లు వచ్చే రావొచ్చు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమైతే ఢిల్లీలో ఇన్నాళ్లుగా సాగుతున్న బీజేపీ ఆధిపత్యానికి చెక్ పడ్డట్లు అవుతుంది. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఢిల్లీ మున్సిపల్ పరిధిలో అవినీతిని తొలగిస్తానని హామీ ఇచ్చాడు.

Exit Polls: గుజరాత్‌లో మళ్ళీ బీజేపీదే అధికారం.. హిమాచల్‌లో బీజేపీ-కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ

ఢిల్లీలో ప్రధానంగా ఉన్న కాలుష్యం, చెత్త నిర్వహణ వంటివి ఈ ఎన్నికల్లో ప్రధానంగా ప్రచారాస్త్రాలుగా మారాయి. ఢిల్లీని 15 ఏళ్లుగా పాలిస్తున్న బీజేపీ వ్యర్థాల నిర్వహణకు పరిష్కారం చూపలేకపోయిందని, తాము అధికారంలోకి వస్తే ఈ సమస్యను పరిష్కరిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. కాగా, ఢిల్లీలో ఇప్పటికే అధికారంలో ఉన్న ఆప్.. మున్సిపాలిటీలో కూడా అధికారం చేజిక్కించుకుంటే అర్బన్ ప్రాజెక్టుల్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా చేపట్టవచ్చని భావిస్తోంది.