Meat Shops : 9 రోజుల పాటు మాంసం దుకాణాలు బంద్!

దీని ద్వారానే తాము ఆదాయం పొందుతామని, దుకాణాలు బంద్ చేయాలని చెప్పడంతో నష్టాలను చవి చూస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల విలువైన మాంసం ఉత్పత్తులున్నాయన్నారు. దీనిపై...

Meat Shops : 9 రోజుల పాటు మాంసం దుకాణాలు బంద్!

Meet Shops

Meat Shops Closed In Ghaziabad : ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా 9 రోజుల పాటు మాంసం దుకాణాల్ బంద్ చేయాలని ఆదేశాలు రావడంతో వ్యాపారస్తులు లబోదిబోమంటున్నారు. తమ జీవనోపాధి కోల్పోయేలా చేశారని వాపోతున్నారు. నగర వ్యాప్తంగా నిషేధం విధించడంతో తాము ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతామని వెల్లడిస్తున్నారు. ఘజియాబాద్ లో 9 రోజుల పాటు ఉత్సవాలు కొనసాగతున్న సందర్భంగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 2022, ఏప్రిల్ 02వ తేదీ శనివారం ప్రారంభమైన ఉత్సవాలు ఏప్రిల్ 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఘజియాబాద్ లో నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మాంసం దుకాణాలు మూసివేయాలని చెప్పడం ఇదే తొలిసారి అని, కానీ మద్యం దుకాణాలు తెరిచారని వెల్లడించారు.

Read More : Arunachal Pradesh : ఇద్దరు పౌరులపై పొరపాటున ఆర్మీ కాల్పులు..

దీని ద్వారానే తాము ఆదాయం పొందుతామని, దుకాణాలు బంద్ చేయాలని చెప్పడంతో నష్టాలను చవి చూస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల విలువైన మాంసం ఉత్పత్తులున్నాయన్నారు. దీనిపై ఘజియాబాద్ మేయర్ ఆశా శర్మ స్పందించారు. ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడారు. మాంసం, మద్యం వేర్వేరు అని, వీటిని ఒకదానితో ఒకటి చూడలేమన్నారు. మతపరమైన సెంటిమెంట్ కు సంబంధించింది.. పచ్చి మాంసాన్ని ఆలయ పరిసర ప్రాంతాల్లో విక్రయించకూడదని, ఇలా ప్రతిసారి జరుగుతుందన్నారు. తాము ఒకరికి లాభం, మరొకరికి నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించమని మేయర్ స్పష్టం చేశారు. అయితే.. ఘజియాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ ఆర్కే సింగ్ ఉత్తర్వులపై వివరణనిచ్చారు. లెసెన్స్ పొందిన మాంసం దుకాణాలు మాత్రమే నిబంధనలను అనుసరించి కవర్ చేయబడిన మాంసం విక్రయించవచ్చని, జంతువుల కళేబరాలు బహిరంగ ప్రదేశాల్లో వేయడానికి అనుమతించబడదని తెలిపారు. నవరాత్రుల సందర్భంగా మాంసం దుకాణాల వద్ద పారిశుధ్యం మెరుగ్గా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్కే సింగ్ తెలిపారు.