Suriyur Jallikattu : జల్లికట్టులో విషాదం..యజమానినే చంపేసిన ఎద్దు

ఓ ప్రాంతంలో జరిగిన పోటీల్లో విషాదం చోటు చేసుకుంది. సొంత యజమానినే ఓ ఎద్దు చంపేసింది. శ్రీరంగంకు చెందిన మీనాక్షి సుందరం తన ఎద్దును...

Suriyur Jallikattu : జల్లికట్టులో విషాదం..యజమానినే చంపేసిన ఎద్దు

Jallikattu

Bull Owner Gored To Death : తమిళనాడు రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా..జల్లికట్లు పోటీలు జరిగాయి. కోవిడ్ విజృంభిస్తున్న వేళ..పలు నిబంధనలు పాటిస్తూ..ఈ పోటీలు నిర్వహించుకోవాలని అక్కడి సర్కార్ చెప్పినా…అవన్నీ ఏమీ జరగలేదు. మాస్క్ లు, భౌతిక దూరం పాటించకుండానే భారీగా ప్రజలు తరలివచ్చారు. జల్లికట్లు పోటీల సందర్భంగా ఎంతోమంది యువకులు గాయపడ్డారు. సాహసోపేతమైన క్రీడగా భావిస్తుంటారు.

Read More : BrahMos missiles: ఫిలిప్పీన్స్ కు బ్రహ్మోస్ క్షిపణులు, అదే బాటలో అరబ్ దేశాలు

తురుముకొస్తున్న ఎద్దులను వశపరచుకోవాలని ప్రయత్నిస్తుంటారు. కానీ ఆ ఎద్దు మాత్రం తప్పంచుకొనే ప్రయత్నం చేస్తుంటుంది. ఈ ప్రయత్నంలో ఎద్దు కొమ్ములు తగిలి గాయాలపాలవుతుంటారు. 2022, జనవరి 15వ తేదీ శనివారం నాడు ఓ ప్రాంతంలో జరిగిన పోటీల్లో విషాదం చోటు చేసుకుంది. సొంత యజమానినే ఓ ఎద్దు చంపేసింది. శ్రీరంగంకు చెందిన మీనాక్షి సుందరం తన ఎద్దును తిరుచ్చి సమీపంలోని సురియూర్ గ్రామానికి తీసుకొచ్చాడు. అక్కడ జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయి.

Read More : Volcanic Eruption : పేలిన భారీ అగ్నిపర్వతం.. దూసుకొచ్చిన సముద్రం.. పలు దేశాలకు సునామీ హెచ్చరిక!

పోటీల్లో పాల్గొనే ముందు నిర్వహించిన వైద్య పరీక్షలను ఆ ఎద్దుకు కూడా నిర్వహించారు. అనంతరం జల్లికట్టు వద్దకు తీసుకెళుతుండగా…ఎద్దు రెచ్చిపోయింది. కొమ్ములు ఒక్కసారిగా విరుచుకపడడంతో మీనాక్షి సుందరంకు గాయాలయ్యాయి. కొమ్ములు బలంగా ఆయన తొడలోకి దూసుకెళ్లాయి. వెంటనే అక్కడున్న సిబ్బంది…మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రరక్తస్రావం జరగడంతో ఆయన మృతి చెందారని వైద్యులు వెల్లడించారు. ఆయన చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.