Mega Cabinet : మోదీ మెగా టీం విశేషాలు, మహిళలకు ప్రాధాన్యత,

కేబినెట్ విస్తరణ విషయానికి వస్తే...అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించారు. మంత్రుల సరాసరి వయస్సు 61 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాలకు తగ్గించడం విశేషం.

Mega Cabinet : మోదీ మెగా టీం విశేషాలు, మహిళలకు ప్రాధాన్యత,

Modi Mega Team

Modi Mega Cabinet : మోదీ మెగా టీం తయారైంది. కేంద్ర కేబినెట్ విస్తరణ కసరత్తు పూర్తయ్యింది. 2021, జూలై 07వ తేదీ బుధవారం సాయంత్రం 06.30గంటలకు రాష్ట్రపతి భవన్ లో ఈ ప్రమాణ స్వీకారం జరుగనుంది. ఇక కేబినెట్ విస్తరణ విషయానికి వస్తే…అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించారు. మంత్రుల సరాసరి వయస్సు 61 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాలకు తగ్గించడం విశేషం.

Read More : Google Pay Recharge : గూగుల్ పే‌తో మీ జియో, ఎయిర్‌టెల్ నెంబర్లకు రీచార్జ్ చేసుకోండిలా..!
దళిత సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు మోదీ. 12 మందికి మంత్రులుగా అవకాశం కల్పించారు. అంతేగాకుండా..కేబినెట్ విస్తరణలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. వైద్యులు, న్యాయవాదులు, ఇంజనీర్లకు అవకాశం కల్పించారు. కొన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యం కల్పించారని, ఎన్నికలను దృష్టి పెట్టుకుని కేబినెట్ విస్తరణ చేశారనే విమర్శలు రాకుండా జాగ్రత్త పడింది.

Read More : Haiti President : హైతీ అధ్యక్షుడు జావెనెల్‌ మోసె దారుణ హత్య
అందుకే దేశంలో అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండేలా ప్రయత్నం చేశారు. ఇక సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయబోయే 43 మంత్రులలో… ఏడుగురు ఉత్తరప్రదేశ్, ఐదుగురు మహారాష్ట్ర, ఐదుగురు కర్నాటక, నలుగురు పశ్చిమ బెంగాల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవలే జరిగిన కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బలు తగిలాయి. ప్రధానంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఒక సంవత్సరం మాత్రమే టైం ఉంది. మిత్రపక్షాలను సంతృప్తిపరిచేలా వివిధ సమీకరణాలను మోదీ పరిశీలించారని తెలుస్తోంది.

Read More : Jeff Bezos Wealth Record : జెఫ్ బెజోస్ ఆదాయం ఎంతో తెలుసా? ఆల్ టైం రికార్డు స్థాయికి ఆస్తుల విలువ