Incredible Video: ఇది ఏ జలపాతమో ఎవరైనా చెప్పగలరా? అంటూ వీడియో పోస్ట్ చేసిన సీఎం సంగ్మా

కొద్ది సేపటి తర్వాత కాన్రాడ్ సంగ్మా దీనిపై స్పందిస్తూ అది ఏ జలపాతమో స్వయంగా వివరించారు. ‘‘ఇది ఫీ ఫీ జలపాతం. ఎవరు సరిగ్గా గుర్తుపట్టారో వారికి అభినందనలు’’ అని సంగ్మా చెప్పారు. ఈ ఫీ ఫీ జలపాతం పశ్చిమ జైంటియా హిల్స్ జిల్లాలో ఉంటుంది. సీఎం సంగ్మా పోస్ట్ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Incredible Video: ఇది ఏ జలపాతమో ఎవరైనా చెప్పగలరా? అంటూ వీడియో పోస్ట్ చేసిన సీఎం సంగ్మా

Incredible Video

Incredible Video: దట్టమైన చెట్లు, ఎత్తైన కొండలు, జలపాతాలు, సరస్సులు వంటి ప్రకృతి అలంకారాలతో చూడముచ్చటగా ఉంటుంది మేఘాలయా. అటువంటి ప్రాంతం మీదుగా హెలికాప్టర్ లో మేఘాలయా ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా వెళ్తూ ఆ దృశ్యాలను తన కెమెరాలో బంధించారు. దట్టమైన అడవి, ఎత్తైన కొండల మధ్య ఉన్న జలపాతం ఉండడం ఇందులో చూడొచ్చు.

ఇది అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది ఏ జలపాతమో ఎవరైనా చెప్పగలరా? అని సంగ్మా ప్రశ్నించారు. జైంతియా హిల్స్ మీదుగా వెళ్తున్న సమయంలో ఆయన ఈ వీడియో తీశారు. చాలా మంది ఇది ఏ జలపాతమో చెప్పలేకపోయారు. కొందరు మాత్రం సరిగ్గా గుర్తు పట్టారు. కొద్ది సేపటి తర్వాత కాన్రాడ్ సంగ్మా దీనిపై స్పందిస్తూ అది ఏ జలపాతమో స్వయంగా వివరించారు.

Deer Escapes Video: తెలివిగా బారియర్ గేటు దాటుకుని బయటకు జింక

‘‘ఇది ఫీ ఫీ జలపాతం. ఎవరు సరిగ్గా గుర్తుపట్టారో వారికి అభినందనలు’’ అని సంగ్మా చెప్పారు. ఈ ఫీ ఫీ జలపాతం పశ్చిమ జైంటియా హిల్స్ జిల్లాలో ఉంటుంది. సీఎం సంగ్మా పోస్ట్ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సంగ్మా ఇటువంటి వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేయడం ఇది తొలిసారి కాదు. ఆయన పదే పదే ఇటువంటి వీడియోలు పోస్టు చేస్తుంటారు. మేఘాలయాలో ఉన్న పర్యాటక ప్రదేశాలను ఆయన ఈ విధంగా ప్రచారం చేస్తుంటారు.

 

View this post on Instagram

 

A post shared by Conrad Sangma (@conrad_k_sangma)

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..