మేఘాలయ సీఎంకి కరోనా

  • Published By: venkaiahnaidu ,Published On : December 11, 2020 / 11:49 PM IST
మేఘాలయ సీఎంకి కరోనా

Meghalaya Chief Minister Tests Positive For COVID-19 ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సీఎంలు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. తాజాగా మేఘాలయ సీఎం కాన్రాడ్​ సంగ్మా కరోనా బారిన పడ్డారు.

తనకు కరోనా వైరస్ సోకినట్టు శుక్రవారం(డిసెంబర్-11,2020)స్వయంగా సీఎం సంగ్మా ట్విట్టర్ వెల్లడించారు. నాకు కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. అతి కొద్ది లక్షణాలు మాత్రమే ఉన్నాయి. నాతో కాంటాక్ట్‌లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోండి. గత ఐదు రోజుల్లో నన్ను కలిసిన వారు టెస్టులు చేయించుకోండి. ఆరోగ్యం గురించి చెక్ చేయించుకోండి. క్షేమంగా ఉండండి అని కన్రాడ్ కె సంగ్మా తన ట్వీట్ లో పేర్కొన్నారు.

కాగా, సంగ్మా కేబినెట్‌లో ఇద్దరు మంత్రులు ఆరోగ్య శాఖ మంత్రి ఏఎల్ హేక్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి స్నైవభలంగ్ ధర్ ఇద్దరూ అక్టోబర్‌లో కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.

అయితే, ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల సీఎంలు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. కర్ణాటక,మధ్యప్రదేశ్,హిమాచల్ ప్రదేశ్,అరుణాచల్ ప్రదేశ్,హర్యానా,గోవా,మణిపూర్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనాబారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.

కాగా, మేఘాలయలో ఇప్పటి వరకు 12,586 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 123 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక, దేశవ్యాప్తంగా కొత్తగా 29,398 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 97 లక్షల 96 వేలు దాటింది. దేశవ్యాప్తంగా 1,42,186 కరోనా మరణాలు నమోదయ్యాయి.