Jammu And Kashmir: అధికారిక బంగళా ఖాళీ చేయాలంటూ మాజీ సీఎంకు నోటీసులు

తన తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రి పదవిని విడిచిపెట్టిన తర్వాత 2005లో ఆయనకు ఈ ప్రాంతం కేటాయించినట్టు చెప్పారు. ఆ ప్రకారం చూసినప్పుడు సీఎం కోసం ఉద్దేశించిన బంగ్లా అంటూ అధికారులు చెప్పడం సరికాదని తెలిపారు. కోర్టును ఆశ్రయించనున్నారా అని అడిగినప్పుడు తన లీగల్ టీమ్‌ను ముందుగా సంప్రదిస్తానని ఆమె జవాబిచ్చారు

Jammu And Kashmir: అధికారిక బంగళా ఖాళీ చేయాలంటూ మాజీ సీఎంకు నోటీసులు

Mehbooba Mufti asked to vacate official accommodation

Jammu And Kashmir: జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత మెహబూబా ముఫ్తీకి అధికార యంత్రాంగం తాజాగా నోటీసులు పంపింది. శ్రీనగర్‌లోని అధికారిక బంగళాను ఖాళీ చేయాల్సిందిగా ఆ నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితమే ఆమెకు ఈ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. శ్రీనగర్‌లోని అత్యంత భద్రతా ఏర్పాట్లున్న గుప్కార్ ప్రాంతంలో మెహబూబా ముఫ్తీ బంగ్లా ఉంది. అయితే ఈ నోటీసులపై ఆమె స్పందిస్తూ తనకు నోటీసులు ఇవ్వడం ఆశ్చర్యం అనిపించలేదని, ఇది ఊహించినదేనని తెలిపారు. తాను ఉంటున్న బంగ్లా జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రికి ఉద్దేశించిన బంగ్లా అంటూ తనకు నోటీసులు ఇచ్చారని, అయితే విషయం అది కాదని ఆమె అన్నారు

తన తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రి పదవిని విడిచిపెట్టిన తర్వాత 2005లో ఆయనకు ఈ ప్రాంతం కేటాయించినట్టు చెప్పారు. ఆ ప్రకారం చూసినప్పుడు సీఎం కోసం ఉద్దేశించిన బంగ్లా అంటూ అధికారులు చెప్పడం సరికాదని తెలిపారు. కోర్టును ఆశ్రయించనున్నారా అని అడిగినప్పుడు తన లీగల్ టీమ్‌ను ముందుగా సంప్రదిస్తానని ఆమె జవాబిచ్చారు. ”నేను ఉండటానికి సొంత జాగా లేదు. ఏ నిర్ణయం తీసుకోవడానికైనా ముందు మా లీగల్ టీమ్‌తో మాట్లాడాలి” అని మెహబూబూ తెలిపారు. 2018లో బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో మెహబూబా ప్రభుత్వం పడిపోయింది. అప్పటి నుంచి బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు మెహబూబా.

Pakistan: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‭ను అనర్హుడిగా ప్రకటించిన ఎన్నికల సంఘం