Mehbooba Mufti : ప్రధానితో భేటీ తర్వాత రోజే ముఫ్తీ కీలక వ్యాఖ్యలు

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 ని తిరిగి పునరుద్దరించే వరకూ తాను వ్యక్తిగతంగా ఏ ఎన్నికల్లో పోటీ చేయనని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ మరోసారి సృష్టం చేశారు.

Mehbooba Mufti : ప్రధానితో భేటీ తర్వాత రోజే ముఫ్తీ కీలక వ్యాఖ్యలు

Mufti (2)

Mehbooba Mufti జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 ని తిరిగి పునరుద్దరించే వరకూ తాను వ్యక్తిగతంగా ఏ ఎన్నికల్లో పోటీ చేయనని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ మరోసారి సృష్టం చేశారు. ఒకవేళ తన పార్టీ ఎన్నికల్లో గెల్చినా కూడా తాను సీఎం కానని ఆమె తేల్చిచెప్పారు. ఆర్టికల్ 370 తీర్మాణం ఓ నినాదం మాత్రమే అని ప్రజలు అనుకోకుండా ఉండేందుకే తాను ఇలా చేస్తున్నట్లు ముఫ్తీ తెలిపారు. అయితే 14మంది కశ్మీర్ నేతలతో ప్రధాని భేటీ అయిన మరుసటి రోజే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో మొహబూబా ముఫ్తీ మాట్లాడుతూ..జమ్మూకశ్మీర్ లో చాలా అణిచివేత ఉందన్నారు. ప్రజలు శ్వాస కూడా తీసుకోలేకపోతున్నారన్నారు. జమ్మూకశ్మీర్ లో క్షేత్రస్థాయి పరిస్థితి..ప్రపంచానికి కేంద్రప్రభుత్వం చెబుతున్నట్లుగా లేదన్నారు. జమ్మూకశ్మీర్ ప్రజలు సంతోషంగా లేదని..తమకు ఊపిరి ఆడనివ్వడం లేదని ఫీల్ అవుతున్నారని ముఫ్తీ తెలిపారు. కశ్మీర్ ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని,చాలా ఆత్మహత్యలు జరుగుతున్నాయని..ప్రాంతం మొత్తం డిప్రెషన్ లో ఉందని ముఫ్తీ అన్నారు. ఆర్టికల్ 370,ఆర్టికల్ 35A రద్దు తర్వాత..తమ జనాభా తగ్గిపోతుందని కశ్మీర్ ప్రజలు భయపడుతున్నారన్నారు. కాబట్టి కేంద్రం ఈ ఆందోళనలను పరిష్కరించాలన్నారు. స్థానిక యువతకు ఉద్యోగాల భద్రత ఉండేలా చూడటం మరో ముఖ్యమైన విషయమన్నారు. ఇక, ఉగ్రవాద సానుభూతిపరురాలిగా బీజేపీ మిమ్మల్ని విమర్శించినప్పటికీ ఎందుకు నిన్న ప్రధానితో భేటీకి మిమ్మల్ని ఆహ్వానించారు అన్న ప్రశ్నకు..ఇది ప్రధాని,హోం మంత్రి జవాబు చెప్పాల్సిన విషయమని ముఫ్తీ సమాధానమిచ్చారు.

కశ్మీర్ విషయంలో తాము అనుకున్న విధంగా జరగలేదని కేంద్ర ప్రభుత్వం గ్రహించిందని ముఫ్తీ అన్నారు. వారిలో మిగిలిఉన్న కొద్దిపాటి సానుభాతి వల్ల..వారు(కేంద్రప్రభుత్వం)తమని కలవాలని నిర్ణయించుకుంచుకొని ఉండవచ్చునని..తాము ప్రధాని కార్యాలయానికి గౌరవం ఇచ్చి మీటింగ్ కు వెళ్ళామని ముఫ్తీ అన్నారు. అయితే తమను ఢిల్లీకి పిలిచి మాట్లాడం స్వాగతించదగిన చర్య అని తాను అంగీకరిస్తున్నట్లు ముఫ్తీ అన్నారు. స్నేహపూర్వక వాతారణంలో ప్రధానితో గురువారం మీటింగ్ జరిగందని..తాము చెప్పాలనుకున్నది ప్రధాని,హోం మంత్రి విన్నారని తెలిపారు. కశ్మీర్ లో ఎన్నికలు జరిపే ముందు విశ్వాసాన్ని పెంపొందించే చర్యలను చేపట్టాల్సిన అవసరముందని ముఫ్తీ అన్నారు. విశ్వాసాన్ని కలిగించే చర్యల్లో భాగంగా రాజకీయ పార్టీల నేతలు మాత్రమే కాకుండా మిగిలిన చాలామందని కూడా జైళ్ల నుంచి విడుదల చేయాల్సి ఉందని ముఫ్తీ తెలిపారు.

కశ్మీర్ లో ఉగ్రవాదం తగ్గిందని డేటా చెబుతున్నప్పటికీ..ఇంకా ఆందోళన ఉందన్నారు. స్థానిక యువత గన్ లు చేతబడుతున్నారని..ఆ తర్వాత చంపబడుతున్నారని..వారి సమాధులపై ఉండే జెండా పాకిస్తాన్ జెండాగా మారుతోందన్నారు. తీవ్రవాదులు చంపబడిన తర్వాత వాళ్లు పాకిస్తానీ అవుతున్నారని అన్నారు. పలు విషయాలను నిర్భయంగా రిపోర్ట్ చేస్తున్న జర్నలిస్టులకు కూడా ఇప్పుడు నోటీసులు వస్తున్నాయని..దీంతో ప్రజలు స్వేచ్ఛగా వారికి తమ బాధలు చెప్పుకోలేకపోతున్నారన్నారు. చిన్న చిన్న విషయాలకే సెక్యూరిటి ఫోర్సెస్ ప్రజలను తీసుకెళ్లి ప్రజలను వేధిస్తున్నట్లు ముఫ్తీ తెలిపారు.