సీఎంగా ఉండగా..కార్పెట్ల కోసం ఒక్కరోజులో రూ. 28లక్షలు ఖర్చు చేసిన మెహబూబా ముఫ్తీ

సీఎంగా ఉండగా..కార్పెట్ల కోసం ఒక్కరోజులో రూ. 28లక్షలు ఖర్చు చేసిన మెహబూబా ముఫ్తీ

Mehbooba Mufti అధికారంలో ఉండగా జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ చేసిన ఖర్చులపై ఆర్టీఐ ద్వారా కీలక విషయాలు వెల్లడయ్యాయి. 2018లో జనవరి నుంచి జూన్ మధ్య రూ.82 లక్షలు ఖర్చు చేశారని తెలిసింది. జమ్మూకశ్మీర్ కి చెందిన ఇనామ్​ ఉన్​ నబీ సౌదాగర్ అనే కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడం ద్వారా ఈ వివరాలు బయటికొచ్చాయి.

2018లో జనవరి నుంచి జూన్ మధ్య దాదాపు రూ.82లక్షలు ఖర్చుపెట్టి దుప్పట్లు, ఫర్నిచర్, టీవీలు తదితర వస్తువులను కొనుగోలు చేసినట్లు తెలిసింది. శ్రీనగర్​లోని గుప్కార్​ రోడ్డులో ఉన్న అధికారిక నివాసానికి ఈ సొమ్మును ఖర్చు చేశారు ముఫ్తీ. ఈ మొత్తం సొమ్మును కేంద్ర ప్రభుత్వం చెల్లింయినట్లు తేలింది. నబీ సౌదాగర్​కు గతేడాది సెప్టెంబరు 1న ఆర్టీఐ ద్వారా ఈ వివరాలు అందాయి. అయితే జిల్లా అభివృద్ధి మండళ్ల ఎన్నికలు జరిగాక ఈ విషయాలు బయటపడటం గమనార్హం

2018లో మార్చి- 28న ఒక్కరోజే మొహబూబా ముఫ్తీ రూ.28 లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడైంది. ఈ డబ్బును కార్పెట్ల కొనుగోలుకు వినియోగించినట్లు తెలిసింది. ఒక్క మార్చి నెలలోనే ఆమె రూ.56 లక్షలు ఖర్చు చేశారు. ఫిబ్రవరి 22న రూ.11,62,000 విలువ చేసే దుప్పట్లను​ కొనుగోలు చేశారని తెలిసింది. జూన్​ నెలలో రూ.25 లక్షలతో… టీవీలు(రూ.22 లక్షలు) సహా పలు వస్తువులు కొనుగోలు చేసినట్లే వెల్లడైంది. ఇక, 2017లో జనవరి 30న రూ.14 లక్షలు ఖర్చు చేశారని, అందులో ఓ గొడుగుకు అయిన ఖర్చు రూ. 2.94 లక్షలని తెలిసింది. ఆగస్టు 2016 నుంచి జులై 2018 మధ్య వంట సామగ్రి కోసం 40 లక్షలు ఖర్చు చేశారని వెల్లడైంది.