Tamilnadu Elections: మంగళవారం తమిళనాడులో ఒకే దశలో ఎన్నికల పోలింగ్ జరిగింది. రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరపడంలో అధికారులు సక్సెస్ అయ్యారు. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు తప్పితే ఎక్కడ కూడా పెద్దగా ఘర్షలు జరగలేదు. ఇక ఎన్నికల అధికారుల అక్కడక్కడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈవీఎంలను దొంగలు ఎతుకుపోతున్న సెక్యూరిటీ సిబ్బంది కానీ ఎన్నికల అధికారులు గాని పసిగట్టలేకపోయారు.
చెన్నైలోని వెలాచేరీ ప్రాంతం ఇద్దరు వ్యక్తులు రెండు ఈవీఎంలను చోరీ చేశారు. వాటిని ధ్వంసం చేసేందుకు యత్నించగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. ఈ ఈవీఎంలు రిజర్వ్ యూనిట్లని ఎన్నికల అధికారులు తెలిపారు. అయినా కూడా ఇద్దరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇక పశ్చిమ బెంగాల్ లో కూడా ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. ఎన్నికల అధికారి ఈవీఎంలు వీవీ ఫ్యాట్స్ తీసుకోని టీఎంసీ నేత ఇంటికి వెళ్ళాడు. ఆయన వెంట సెక్యూరిటీని కూడా తీసుకెళ్లారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో తపన్ సర్కార్ అనే ఎన్నికల అధికారిని ఉన్నతాధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు.