రాత్రి వేళ..రోడ్డుపై మహిళలు, వాహనం ఆపారో అంతే సంగతులు..అసలు ట్విస్ట్ ఏంటంటే

రాత్రి వేళ..రోడ్డుపై మహిళలు, వాహనం ఆపారో అంతే సంగతులు..అసలు ట్విస్ట్ ఏంటంటే

loot cars on National Highway : రాత్రి వేళ..నేషనల్ హైవేపై మహిళలు. వాహనాలు ఆపాలని రిక్వెస్ట్ చేస్తున్నారా ? ఏమాత్రం ఆపకండి. ఆపారో బుక్ అయిపోతారు. వాహనాన్ని హైజాక్ చేయడం, అందినంత డిమాండ్ చేసి..దోచుకోవడం వంటివి చేస్తుంటారు. కానీ..చివర్లో అసలు విషయం తెలిసి పోలీసులే షాక్ తిన్నారు. ఈ ఘటన కోల్ కతాలో చోటు చేసుకుంది.

పశ్చిమ బెంగాల్ లోని నదియా జిల్లాలో రానాఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేషనల్ హైవే 34పై రాత్రి వేళ ఇద్దరు అమ్మాయిలు నిల్చొని ఉన్నారు. అదే సమయంలో..పెట్రోలింగ్ వాహనం చక్కర్లు కొడుతోంది. రాత్రి వేళ అమ్మాయిలు ఉండడం చూశారు పోలీసు సిబ్బంది. దీంతో వారికి సహాయం చేద్దామని భావించారు. అయితే..పెట్రోలింగ్ వాహనం చూసిన మహిళలు పరుగులు పెట్టారు. ఎందుకో అనుమానం కలిగింది. వారిని వెంబడించారు పోలీసులు.

ఇద్దర్నీ పట్టుకున్నారు. అనంతరం వారు మహిళలు కాదని, పురుషులని విషయం తెలిసి షాక్ తిన్నారు పోలీసులు. మహిళల వేషంలో నిల్చుని, వాహనాలను ఆపి..వాటిని హైజాక్ చేస్తామని, అలా కుదరకపోతే..అందులో ఉన్న వ్యక్తి దగ్గర నగదు, ఇతరత్రా దోచుకుంటామని నిందితులు వెల్లడించారు. వీరిని అరెస్టు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.