ఢిల్లీలో అల్లర్లు : మసీదుపై కాషాయ జెండా!

  • Published By: madhu ,Published On : February 26, 2020 / 07:45 AM IST
ఢిల్లీలో అల్లర్లు : మసీదుపై కాషాయ జెండా!

దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు కలకలం సృష్టిస్తున్నాయి. సోషల్ మీడియాలో అల్లర్లకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే ఈ అల్లర్లు చోటు చేసుకోవడం గమనార్హం. పరస్పర దాడుల్లో 20 మందికిపైగా చనిపోయారు. ప్రజా ఆస్తులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈశాన్య ఢిల్లీలో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని అంచనా. ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు వెల్లడిస్తున్నారు.

ఇదిలా ఉంటే…అశోక్ నగర్‌లోని ఓ మసీదుపైకి కొంతమంది ఎక్కిన వీడియో రచ్చ రచ్చ అవుతోంది. మసీదుపై ఉన్న మినార్‌పై ఎక్కడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ముఖానికి బట్టలు కట్టుకున్న యువకులు..ఎక్కి..కాషాయ జెండా పాతినట్లుగా ఉంది. ఈ వీడియోను ఆయుబ్ అనే జర్నలిస్టు ట్విట్టర్ వేదికగా..ట్వీట్ చేశారు.

క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది. సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు దీనికి ఎలాంటి సంబంధం లేదని వెల్లడిస్తూ..ఈ వీడియోను డిలీట్ చేశాడు జర్నలిస్టు. అయితే..సీఏఏకు వ్యతిరేకంగా అల్లర్లు జరుగుతున్నాయని భావించి..తర్వాత..తిరిగి వీడియోను పోస్టు చేశారు. 

పూనావాలా అనే వ్యక్తి ట్వీట్ చేశారు. జర్నలిస్టు ఆయూబ్ తప్పుడు సమాచారం ఇస్తూ..ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. చాలా మంది ఆయూబ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తప్పుడు వీడియోను పోస్టు చేసిన అతడిపై చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ వీడియో ఫేకా ? అసలా ? అనేది తెలియాల్సి ఉంది.