Men Wore Mangala Sutra: మంగ‌ళ‌సూత్రం ధ‌రించిన వ‌రుడు.. మ‌రి నెల‌స‌రి అవుతున్నాడా..?

భారతీయ సంప్రదాయంలో మంగళసూత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. వివాహ సమయంలో వరుడు వధువు మేడలో మంగళసూత్రం కడతారు. ఇక మంగళ అంటే శుభప్రదం, శోభాయమానం, సూత్రం అంటే తాడు అని అర్ధం. కలకలం సుమంగళిగా ఉండాలని వేదమంత్రుచరణల మధ్య వరుడితో వధువు మేడలో మూడు ముళ్ళు వేసి దీనిని కట్టించడం జరుగుతుంది.

Men Wore Mangala Sutra: మంగ‌ళ‌సూత్రం ధ‌రించిన వ‌రుడు.. మ‌రి నెల‌స‌రి అవుతున్నాడా..?

Men Wore Mangala Sutra (4)

Men Wore Mangala Sutra: భారతీయ సంప్రదాయంలో మంగళసూత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. వివాహ సమయంలో వరుడు వధువు మేడలో మంగళసూత్రం కడతారు. ఇక మంగళ అంటే శుభప్రదం, శోభాయమానం, సూత్రం అంటే తాడు అని అర్ధం. కలకాలం సుమంగళిగా ఉండాలని వేదమంత్రుచారణల మధ్య వరుడితో వధువు మేడలో మూడు ముళ్ళు వేసి మంగళసూత్రం కట్టించడం జరుగుతుంది. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. మంగళసూత్రం కట్టే పద్దతి ఆరవ శతాబ్దంలోనే ప్రారంభమైందని చరిత్రకారులు చెబుతుంటారు.

అయితే ఇప్పుడు ఈ మంగళసూత్రం వార్తల్లోకి ఎక్కడానికి కారణం వధువు, వరుడి మేడలో కట్టడమే.. వధువు మేడలో వేలాడాల్సిన మంగళసూత్రం వరుడు మేడలో వేలాడుతుండటం ఇప్పుడు వైరల్ వార్తగా మారింది. ఇక ఈ పెళ్లి వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన శార్దూల్ క‌దం, తనూజా మంచి స్నేహితులు. వీరిద్దరూ ఒకే కాలేజీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. ఆ తర్వాత నాలుగేళ్లు కలవలేదు. అనుకోకుండా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కలుసుకున్నారు. వీరి ఇన్‌స్టా సంభాషణ కాస్త వెతకరంగానే సాగింది.. త‌నుజా త‌న ఇన్‌స్టా పేజీలో హిమేష్ రేష్మియా సాంగ్‌ను పోస్టూ చేస్తూ టార్చ‌ర్ అని ట్యాగ్ చేసింది. దీనిపై శార్దూల్ స్పందిస్తూ మ‌హా టార్చ‌ర్ అని ట్యాగ్ చేశాడు. అలా వారిద్ద‌రి మ‌ధ్య సంభాష‌ణ కొన‌సాగింది.

కొద్దీ రోజుల పాటు చాటింగ్ తర్వాత తనూజా కోరిక మేరకు ఇద్దరు ఓ టీ షాప్ లో కలిశారు. ఈ సమయంలోనే పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అప్పుడే వీరిమధ్య ఫెమినిజమ్ టాపిక్ గురించి చర్చ జరిగింది. తాను హార్డ్‌కోర్ ఫెమినిస్ట్‌(స్త్రీ వాది)ను అని శార్దూల్ చెప్పాడు. ఆమె శార్దూల్ వైపు ఒక ర‌కంగా చూసింది. తాను ఫెమినిస్టును అని త‌నుజా ఊహించ‌లేక‌పోయింది అని శార్దూల్ అన్నాడు.

ఇక వారు టచ్ లోనే ఉంటూ ఇద్దరి ఇష్టాయిష్టాలను తెలుసుకున్నారు. నెల రోజుల తర్వాత ఇద్దరు మళ్లీ కలుసుకున్నారు. ఆ రోజు శార్దూల్ బర్త్ డే. స్నేహితుడి బర్త్ డే గిఫ్ట్ గా తన స్వహస్తాలతో చేసిన గిఫ్ట్ కార్డు ఇచ్చింది తనూజా. అప్పటికే తనూజా మీద మనసు పారేసుకున్నాడు శార్దూల్.. అదే రోజు తన మనసులోని మాటను తనూజాకు తెలిపాడు. ఆమె ఓ చిరునవ్వు నవ్వింది.,, కానీ తన అభిప్రాయం మాత్రం అప్పుడు చెప్పలేదు.

ఇంటికి వెళ్లి రెండు రోజుల తర్వాత తనకు ఇష్టమే అని శార్దూల్ కు సందేశం పంపిణి తనూజా. ఆ తర్వాత ఇద్దరు డేటింగ్ చేశారు. ఏడాది కాలం డేటింగ్ లోనే గడిపారు. తర్వాత పెళ్లి గురించి తల్లిందండ్రుల వద్ద ప్రస్తావన తెచ్చారు. వీరి పెళ్ళికి పెద్దలు ఒకే చెప్పడంతో 2020, సెప్టెంబ‌ర్‌లో పెళ్లికి పెద్ద‌లు నిశ్చ‌యించారు. కానీ క‌రోనా కార‌ణంగా ఆ పెళ్లి వాయిదా ప‌డింది. ఈ క్ర‌మంలో మ‌ళ్లీ వారిద్ద‌రి మ‌ధ్య పెళ్లి ఎలా చేసుకోవాలి అనే అంశంపై చ‌ర్చ వ‌చ్చింది.

మంగళసూత్రం విషయంలో ఇద్దరిమధ్య సుదీర్ఘ చర్చ నడిచింది. తమ పెళ్లి బిన్నంగా ఉండాలని ఇద్దరు అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళసూత్రం తన మేడలో కట్టించుకుంటానని శార్దూల్, తనూజాకు చెప్పాడు. తనూజా, శార్దూల్ కోరికను మన్నించి తన కండిషన్ ఒప్పుకుంది. కానీ ఇంట్లో వారిని ఒప్పించడమే పెద్ద భారమైంది. ఇంట్లో వాళ్ళు మొదట సస్సేమిరా అన్నారు. కానీ చివరకు శార్దూల్ మాట కాదనలేక ఒప్పుకున్నారు.

పెళ్లి సమయంలో తనూజా తల్లితండ్రులకు డబ్బు సమస్య వచ్చింది. డబ్బుకోసం చాలామందిని అడిగారు. కానీ ఎవరు ఇవ్వలేదు. విషయం తెలుసుకున్న శార్దూల్ పెళ్లి ఖర్చుల్లో తాను సగం భరిస్తానని తనూజా తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో వారు ఎంతో సంతోషించి..  పెళ్ళికి ఏర్పాటు చేశారు. పెళ్ళికి రోజులు దగ్గరపడుతుండటంతో తనూజా, శార్దూల్ మధ్య మంగళసూత్రం ప్రస్తావన మరోసారి వచ్చింది.

మంగళసూత్రం ఒకేరోజు వేసుకుంటావా? లేదంటే ఆడవాళ్లలా జీవితాంతం ఉంచుకుంటావా? అంటూ ప్రశ్నించింది తనూజా. ఆ ఒక్క‌రోజే కాదు.. ప్ర‌తి రోజు మంగ‌ళ‌సూత్రం ధ‌రిస్తాన‌ని శార్దూల్ స్ప‌ష్టం చేశాడు. మొత్తానికి నాలుగు నెలల క్రితం త‌నుజా, శార్దూల్ వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు. శార్దూల్ మంగ‌ళ‌సూత్రం ధ‌రించ‌డం బంధువుల‌కు ఇష్టం లేక‌పోయిన‌ప్ప‌టికీ, వాళ్ల కోసం కాదు తాను జీవించేది. త‌న విలువ‌లు, హ‌క్కుల కోసం తాను జీవిస్తున్నాన‌ని శార్దూల్ చెప్పాడు. అందుకే మంగ‌ళ‌సూత్రం ధ‌రిస్తున్నాన‌ని చెప్పాడు.

పెళ్ళైన మరోసారి రోజే వీరి పెళ్లి వ్యవహారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. తనూజా తాళికట్టే ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో చాలామంది వారిని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఇప్పుడు చీర కూడా ధ‌రించండి అంటూ శార్దూల్‌ను ఉద్దేశించి కొందరు విమ‌ర్శించారు. ప్ర‌తి నెల మీరు రుతుస్రావం అవుతున్నారా? అని వ్యంగంగా ప్ర‌శ్నించారు. కానీ ఆ ట్రోల్స్‌ను ఆ నూత‌న దంప‌తులు ప‌ట్టించుకోలేదు. తామేంటో తమకు తెలుసు, సమాజం ఏమనుకున్నా తమకు సంబంధం లేదని తనూజా చెబుతుంది. తమ ఫొటోస్ సోషల్ మీడియాలో తిరిగుతుండటంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది.