Amritpal singh: అదిగదిగో అమృతపాల్ సింగ్, అరెర్రె ఎస్కేప్.. చిక్కినట్టే చిక్కి చెక్తేస్తున్న ఖలిస్తానీ లీడర్

జలంధర్ సమీపంలోని టోల్ బూత్‭లో ఉదయం 11:27 నిమిషాలకు కనిపించినట్లు ఎన్‭డీటీవీ రిపోర్ట్ చేసింది. మారుతి బ్రెజా కారులో అమృతపాల్ ముందు సీట్లో కూర్చున్నారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు పరుగుపరుగున కారును చేజ్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీనికి ముందు షాకోట్‭లోని రోడ్డులో మెర్సిడెజ్ కారులో అతడు కనిపించారు

Amritpal singh: అదిగదిగో అమృతపాల్ సింగ్, అరెర్రె ఎస్కేప్.. చిక్కినట్టే చిక్కి చెక్తేస్తున్న ఖలిస్తానీ లీడర్

mercidez to maruti then bike.. amritpal singh changes vehcyles and clothes

Amritpal singh: వేల మంది పోలీసులు, నిఘా వ్యవస్థ, అధికార యంత్రాంగం కళ్లుగప్పి తిరుగుతున్న ఖలిస్తానీ లీడర్, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృతపాల్ సింగ్ కనిపించినట్లే కనిపించి మాయమవుతున్నారు. దొరికినట్టే దొరికి తప్పించుకుంటున్నారు. అదేంటో విచిత్రం.. నాలుగు రోజుల నుంచి ఆయన వెంట తిరిగే వాళ్లు ఒక్కొక్కరుగా పట్టబడుతున్నారు కానీ అమృతపాల్ సింగ్ మాత్రం చిక్కడం లేదు. తాజాగా ఒక చోట కారులో నుంచి దిగుతూ అమృతపాల్ కనిపించారు. మళ్లీ అంతలోనే ఏమయ్యారో ఎవరికీ తెలియదు. మెర్సిడెజ్ నుంచి మారుతి, అక్కడి నుంచి బైక్.. ఇలా అన్ని తెలుస్తున్నాయి, కొన్ని కనిపిస్తున్నాయి కూడా. అందులో అమృతపాల్ కూడా కనిపిస్తున్నారు. కానీ అంతలోనే అదృశ్యమవుతున్నారు.

Delhi Budget2023: ఢిల్లీ బడ్జెట్‭కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం.. హైడ్రామా ముగిసినట్టేనా?

నాలుగు రోజుల హైడ్రామా నడుమ మంగళవారం ఒక కారు దిగి బైక్ ఎక్కుతూ కెమెరాకు చిక్కారు అమృతపాల్. అది కూడా భద్రతా దళాల కెమెరాకే చిక్కడం మరో విశేషం. కానీ, ఏం లాభం? నాలుగు రోజుల వేట నుంచి ఎలా అయితే ఎస్కేప్ అవుతున్నాడో, తాజాగా అలాగే ఎస్కేప్ అయ్యాడు. కాకపోతే అమృపాల్‭తో పాటు కారులో ప్రయాణించిన నలుగురు మాత్రం పోలీసులకు చిక్కారు. అనంతరం బైక్ మీద సహాయకుడితో ప్రయాణిస్తూ సైతం కెమెరాకు చిక్కాడు. ఈ వీడియోలు బయటికి ఎలా వచ్చాయో తెలియదు కానీ, నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

Uttar Pradesh: దొంగల్ని గుర్తించేందుకు టాయిలెట్‌లో సీసీ కెమెరాలు పెట్టిన పోలీసులు.. మండి పడుతున్న విద్యార్థులు

జలంధర్ సమీపంలోని టోల్ బూత్‭లో ఉదయం 11:27 నిమిషాలకు కనిపించినట్లు ఎన్‭డీటీవీ రిపోర్ట్ చేసింది. మారుతి బ్రెజా కారులో అమృతపాల్ ముందు సీట్లో కూర్చున్నారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు పరుగుపరుగున కారును చేజ్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీనికి ముందు షాకోట్‭లోని రోడ్డులో మెర్సిడెజ్ కారులో అతడు కనిపించారు. అమృతపాల్ తరుచూ బట్టలు మారుస్తున్నాడు. ఒక్కో కారులో ఒక్కోలా కనిపిస్తున్నాడు. రెగ్యూలర్ కాకుండా కొత్త రకం బట్టలు వేస్తున్నాడు. కొంత కాలంగా కనిపిస్తున్నట్టుగా సిక్కు సంప్రదాయ బట్టల్లో కూడా కనిపించడం లేదు.

WSJ on BJP: ఏంటీ బీజేపీ అంతలా ఎదిగిపోయిందా? ప్రపంచంలో చాలా ముఖ్యమైన పార్టీ అని కితాబిచ్చేసిన అమెరికా పత్రిక

గురుద్వారలో బట్టలు మార్చుకుని అక్కడి నుంచి తప్పించుకుంటున్నట్లు పోలీసులు నమ్ముతున్నారు. కాగా, అమృతపాల్ సింగ్ ఫొటోలను పంజాబ్ పోలీసులు తాజాగా విడుదల చేశారు. భిన్న స్టైల్లో ఉన్న నాలుగైదు ఫొటోలను విడుదల వారు చేశారు. కాగా, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికి 120 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. వేట ఇంకా కొనసాగుతున్నట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. అలాగే వారిస్ పంజాబ్ దే సంఘానికి సంబంధించిన బట్టలు ధరించిన వారికి సైతం అరెస్ట్ చేశారు. వీరందరినీ జాతీయ భద్రతా చట్టం కింద అదుపులోకి తీసుకున్నట్లు వెళ్లడించారు.