రైతు నిరసనల్లో వినూత్నంగా రైతు నాయకుడు కొడుకు వివాహం

రైతు నిరసనల్లో వినూత్నంగా రైతు నాయకుడు కొడుకు వివాహం

Message For Marriage At The Protest Site Of Farmers Of Madhya Pradesh1

Message for marriage at the farmers protest : మధ్యప్రదేశ్ వినూత్నంగా వివాహం జరిగింది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లో రైతులు చేస్తున్న నిరసనలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని రేవాలో కూడా రైతులు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. ఆ నిరసనలలో ఓ శుభకార్యం జరిగింది. నిరసనల్లో పాల్గొంటున్న భోపాల్ రైతు నాయకుడు రాంజిత్ సింగ్ కొడుకు పెళ్లి నిశ్చయమైంది.

కొడుకు పెళ్లి కోసం ఉద్యమం నుంచి దూరం కాకూడదనుకున్నాడు రాంజిత్. తన కొడుకు వివాహాన్ని ఆ నిరసనల మధ్యే జరపాలనుకున్నాడు. దీనికోసం వినూత్నంగా ఆలోచించిన రాంజిత్.. కొడుకు పెళ్లిని రైతులంతా ఏకమై చేస్తున్న నిరసనల మధ్యే పెళ్లి జరిపించాలనుకున్నాడు. దీంతో భోపాల్‌కు 500 కిలోమీటర్ల దూరంలోని రేవాలో జరుగుతున్న నిరసనల వద్ద తన కొడుకు సచిన్, కాబోయే కోడలు అస్మా సింగ్‌ల వివాహం జరిపించాడు. నూతన వధూవరులను తోటి రైతులంతా దీవించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రాంజిత్ మాట్లాడుతూ..తాము చేసే నిరసన మధ్యే తమ కొడుక్కి వివాహం చేయటానికి కారణం..కేంద్ర ప్రభుత్వానికి స్ట్రాంగ్ మెసెజ్ ఇవ్వటానికేనని తెలిపారు. ఎన్ని అవాంతరాలు వచ్చిన ఆందోళనలు విరమించేది లేదని స్పష్టంచేశారు.
కొత్త దంపతులిద్దరూ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేశారు. పెళ్లి మంత్రాలతో పాటు వ్యవసాయం చట్టాలను రద్దు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం వివాహం జరిగాక నూతన వధూవరులిద్దరూ..అగ్నిహోత్రం చుట్టు కాకుండా..సావిత్రి భాయి పూలే, రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫోటోల చుట్టూ ఏడు అడుగులు నడిచారు. పెళ్లి సందర్భంగా వచ్చిన బహుమతులన్నింటిని అక్కడ ఉన్న రైతులకు పంచిపెట్టారు. ఈ పెళ్లి జరిపించిన రాంజిత్ సింగ్‌ని రైతులందరూ మెచ్చుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

#farmer union leader organised his son's marriage at a protest site in Rewa, around 500 kilometres from Bhopal, The couple Sachin & Asma Singh took an oath to protect the constitution. They also took pheras around the idols of BabaSaheb & Savitribai Phule #FarmersProtests pic.twitter.com/QYWdXlwnK8
— Anurag Dwary (@Anurag_Dwary) March 18, 2021