కరోనాపై కేంద్రం కీలక నిర్ణయం, మృతుల కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించింది.

  • Published By: veegamteam ,Published On : March 14, 2020 / 10:25 AM IST
కరోనాపై కేంద్రం కీలక నిర్ణయం, మృతుల కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించింది.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్కో కుటుంబానికి రూ.4లక్షలు చొప్పున ఇవ్వాలని డెసిషన్ తీసుకుంది. అలాగే కరోనా వైరస్ ను నోటిఫైడ్ విపత్తుగా(notificed disaster) ప్రకటించింది. మన దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 83కి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కరోనాతో ఇప్పటివరకు ఇద్దరు చనిపోయారు. కర్నాటకలో ఒకరు, ఢిల్లీలో ఒకరు మృతి చెందారు. ఇద్దరూ వృద్ధులే.

See Also | హై అలర్ట్: కేరళలో మరో వైరస్.. కోళ్లను చంపేయాలని ఆర్డర్

భారత్ లో 83కి పెరిగిన కరోనా కేసులు:
కరోనా వైరస్ దెబ్బకి యావత్ ప్రపంచం వణికిపోతోంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాగే మరణాల సంఖ్యా పెరుగుతోంది. దీంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మన భారత దేశంలోనూ కరోనా కమ్మేస్తోంది. క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం(మార్చి 14,2020) నాటికి 83కి చేరింది. ఇప్పటివరకు ఇద్దరు కరోనాతో చనిపోయారు. కర్నాటకలో ఓ వృద్ధుడు, ఢిల్లీలో ఓ వృద్ధురాలు మరణించారు.

విద్యా సంస్థలు, మాల్స్, థియేటర్లు బంద్:
క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. కరోనా వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా కట్టడి దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు మూసివేశారు.
 

ప్రపంచవ్యాప్తంగా 5వేల 438మంది కరోనా మృతులు:
2019 డిసెంబర్ లో చైనాలోని వూహాన్ లో వెలుగుచూసిన కరోనా వైరస్, చైనాని నాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచ దేశాలపై పడింది. కరోనా మహమ్మారి 145 దేశాలకు విస్తరించింది. చైనాలో కరోనా మరణాలు ఆగడం లేదు. అటు యూరప్ లో కరోనా మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు లక్షా 45వేల 700ల మందికి కరోనా సోకగా వారిలో 5వేల 438 మంది చనిపోయారు.
 

Also Read | ఓ దిశా నువ్వెక్కడ ? : మహిళలకు ఎన్నికల్లో నిలబడే హక్కు లేదా – లోకేష్ ట్వీట్