తలపై లేజర్ లైట్ : రాహుల్ కు ప్రాణహాని..హోంశాఖకు కాంగ్రెస్ లేఖ

పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రాణా హాని ఉందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అమేథిలో రాహుల్ కు  భద్రత లోపంపై కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు.

  • Published By: sreehari ,Published On : April 11, 2019 / 11:37 AM IST
తలపై లేజర్ లైట్ : రాహుల్ కు ప్రాణహాని..హోంశాఖకు కాంగ్రెస్ లేఖ

పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రాణా హాని ఉందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అమేథిలో రాహుల్ కు  భద్రత లోపంపై కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు.

అమేథి : పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రాణా హాని ఉందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అమేథిలో రాహుల్ కు  భద్రత లోపంపై కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. అమేథిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో రాహుల్ తలకు గ్రీన్ లేజర్ పాయింట్ గురి పెట్టినట్టు గుర్తించారు. చూడటానికి స్నిపర్ గన్ లేజర్ లా కనిపిస్తోందని లేఖలో కాంగ్రెస్ ఆరోపించింది.

రోడ్ షోలో రాహుల్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆయన తలకు ఏడుసార్లు గ్రీన్ లేజర్ పాయింట్ గురి పెట్టినట్టు వీడియోలో ఉన్నట్టు లేఖలో తెలిపింది. ఆ లేజర్ పాయింట్.. చూస్తుంటే.. స్నిపర్ గన్ నుంచే వచ్చినట్టు వీడియో ఆధారంగా గుర్తించినట్టు లేఖలో పేర్కొంది. కాంగ్రెస్ నేతల్లో అహ్మద్ పటేల్, రన్ దీప్ షుర్జేవాలా, జైరాం రమేశ్ ఈ లేఖపై సంతకం చేసి కేంద్ర హోంశాఖకు పంపారు. 
Read Also : బీభత్సం : పూతలపట్టు వైసీపీ అభ్యర్థి బాబుపై దాడి

2019 లోక్ సభ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ ఏప్రిల్ 10న తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడారు. అదే సమయంలో రాహుల్ తలకు లేజర్ గన్ పాయింట్ కనిపించినట్టు లేఖలో కాంగ్రెస్ ప్రస్తావించింది. దీనికి సంబంధించిన వీడియోను పెన్ డ్రైవ్ లో కేంద్ర హోంశాఖకు సమర్పించినట్టు తెలిపింది. గ్రీన్ లేజర్ లైట్ రెండు రాహుల్ నుదిటిపై పడినట్టు లేఖలో పేర్కొంది.

గాంధీ కుటుంబంలో ఇప్పటికే ఇద్దరు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దారుణంగా హత్యకు గురయ్యారని కాంగ్రెస్ ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఇప్పుడు రాహుల్ గాంధీని టార్గెట్ చేయడం షాకింగ్ గురిచేస్తోందని, పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తం అవుతోందని కాంగ్రెస్ ప్రస్తావించింది. రాజకీయ విభేదాలను పక్కనబెట్టి రాహుల్ గాంధీకి భద్రత కల్పించడంలో యూపీ ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిందిగా కాంగ్రెస్ కోరింది.    
Read Also : EVMలు బాగా పని చేస్తున్నాయ్.. తప్పుడు వార్తలు నమ్మొద్దు : ఈసీ ద్వివేదీ

రాహుల్ కు భద్రత లోపంపై కాంగ్రెస్ రాసిన లేఖపై హోం మంత్రిత్వ శాఖ స్పందించింది. రాహుల్ ప్రాణహాని ఉందనే కాంగ్రెస్ ఆరోపణలను MHA ఖండించింది. రాహుల్ తలపై పడిన గ్రీన్ లేజర్ లైట్.. మొబైల్ ఫోన్ లేదా కెమెరామెన్ నుంచి వచ్చి ఉంటుందని స్పష్టం చేసింది.