MHA : మూడో దశ, పండుగల సీజన్..అప్రమత్తంగా ఉండండి

భారత్‌కు కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉందా? మూడో దశ వైరస్‌కు కేరళ కారణం కానుందా? దేశంలో కరోనా కేసులు పెరగడం, మరణాల సంఖ్య కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

MHA : మూడో దశ, పండుగల సీజన్..అప్రమత్తంగా ఉండండి

3rd Wave

India Covid-19 : భారత్‌కు కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉందా? మూడో దశ వైరస్‌కు కేరళ కారణం కానుందా? దేశంలో కరోనా కేసులు పెరగడం, మరణాల సంఖ్య కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పండగల సీజన్‌ కావడంతో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు సూచించింది. దేశంలో కొన్నాళ్లుగా తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి పలు రాష్ట్రాల్లో మళ్లీ బుసలు కొడుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఒక్కరోజే 46 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 509 మంది ప్రాణాలు కోల్పోయారు.

Read More : Jammu : కరోనా రెండో డోస్ తీసుకున్న బామ్మ, ఈమె వయస్సు ఎంతో తెలుసా ?

కేరళలో నమోదవుతున్న కేసులు భీతిగొల్పేలా ఉన్నాయి. కేరళలో ఏకంగా 32,801 కేసులు వెలుగుచూడగా…179 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మూడో ముప్పు కేరళతోనే మొదలవుతుందన్న భయం ఆవహిస్తోంది. దేశ వ్యాప్తంగా ముందురోజుతో పోల్చితే కరోనా కేసులు 4.7 శాతం పెరిగాయి. ఇటీవల కాలంలో క్రియాశీల కేసులు పెరుగుతుండటం, రికవరీ రేటు పడిపోవడంతో కేంద్రం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమలులో ఉన్న కొవిడ్‌ నిబంధనలు, మార్గదర్శకాలను సెప్టెంబర్‌ 30 వరకు పొడిగించింది.

Read More :Long Covid : కరోనా నుంచి కోలుకున్న వారికి షాకింగ్ న్యూస్, ఏడాది తర్వాత కూడా ఆరోగ్య సమస్యలు

రానున్నది పండుగల సీజన్‌ కావడంతో మరింత కఠినంగా వ్యవహరించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాశారు. టెస్ట్‌, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కోవిడ్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. భారీగా జనం గుమిగూడకుండా చూడాలని, రద్దీ ప్రాంతాల్లో కరోనా నిబంధనల్ని అమలయ్యేలా చూడాలని కేంద్రం ఆదేశించింది. యాక్టివ్‌ కేసులు, పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలతో కట్టడి చర్యలు చేపట్టాలని… అవసరమైతే స్థానికంగా ఆంక్షలు విధించాలని సూచించింది.

Read More : Blood Clot : కరోనా సోకినవారికి కొత్త ముప్పు

మూడోముప్పు ఆందోళనల మధ్య దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ వేగం పుంజుకోవడం ఊరటనిస్తోంది. నిన్న ఒక్కరోజే రికార్డ్‌ స్థాయిలో కోటి మందికి పైగా టీకా వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. భారత్‌లో ఇప్పటివరకు టీకా పంపిణీ 62 కోట్లు దాటింది. భారత్‌లో వ్యాక్సినేషన్‌ జరుగుతున్న తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది.