Uttar Pradesh : తన ఆస్తి మొత్తాన్ని గవర్నర్‌కు రాసిచ్చేసిన 80 ఏళ్ల రైతు..

తన ఆస్తి మొత్తాన్ని గవర్నర్‌కు రాసిచ్చాడు 80 ఏళ్ల రైతు..నా పిల్లలకు నా ఆస్తిపై ఎటువంటి హక్కులేదని తేల్చి చెప్పిన రైతు.

Uttar Pradesh : తన ఆస్తి మొత్తాన్ని గవర్నర్‌కు రాసిచ్చేసిన  80 ఏళ్ల రైతు..

80 year old Uttar Pradesh farmer wills property worth Rs 1.5 crore to governor

Uttar Pradesh : ఆస్తులు తీసుకుని కన్నవారిని నడిరోడ్డుమీద వదిలేసిన బిడ్డలున్నారు ఈ సమాజంలో. అలాగే జవసత్వాలు ఉడికిపోయిన కన్నవారిని అనాథాశ్రమాల్లో చేర్పించేసిన బిడ్డలు ఉన్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు కావాలి కానీ వారి బాధ్యతలు పట్టని పిల్లలున్నారు. తినీ తినకా..కష్టపడి సంపాదించింది అంతా బిడ్డలకే ఇస్తుంటారు తల్లిదండ్రులు. కానీ ఓ తండ్రి మాత్రం అందరిలా ఆలోచించలేదు. తనను అనాథ ఆశ్రమంలో చేర్పించిన బిడ్డలకు తన ఆస్తి ఎందుకివ్వాలి? అని అనుకున్నాడు. అనుకోవటమే కాదు ఓ కీలక నిర్ణయం కూడా తీసుకున్నాడు. నలుగురు పిల్లలున్నా అనాథలా వదిలేసిన పిల్లలకు తన ఆస్తి దక్కకూడదనుకున్నాడు. తాను కష్టపడి సంపాదించి కోటిర్నర రూపాయల విలువైన ఆస్తిని గవర్నర్ కు బదిలీ చేయాని నిర్ణయించుకున్నాడు.

ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్‌నగర్‌ జిల్లా బిరాల్ గ్రామానికి చెందిన 80 ఏళ్ల నాథు సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దానికి కారణం అతనికి పట్టించుకోని బిడ్డలపై అసంతృప్తి. నాథు సింగ్ రైతు. కష్టపడి వ్యవసాయం చేసి నలుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేశాడు. ముగ్గురు కూతుళ్లకు..ఉన్న ఒక్కగానొక్క కొడుకు పెళ్లిళ్లు చేశాడు. అతని కష్టసుఖాల్లో తోడుగా ఉన్న భార్య కన్నుమూసింది. దీంతో నాథు సింగ్ ఒంటరివాడైపోయాడు. 80 ఏళ్ల వ్యక్తికి భార్య లేకపోతే ఎంత లోటో స్వయంగా అనుభవించాడు నాథు సింగ్. దీంతో కొడుకు వద్దే ఉంటున్నాడు. కానీ కొడుకు, కోడలు నాథు సింగ్ అంటే నిర్లక్ష్యం చూపేవారు. కన్నతండ్రిని చూడటానికి కొడుకుకు ఇష్టంలేకుండా పోయింది. దీనికి తోడు భార్య కూడా కారమవ్వటంతో నాథు సింగ్ ను అనాథ ఆశ్రమంలో చేర్పించి చేతులు దులుపుకున్నారు.

అలా నాథు సింగ్ వృద్ధాశ్రమంలో కాలం గడుపుతున్నాడు. కొడుకు, కోడలు పట్టించుకోవటం మానేసారు. దీంతో నాథు సింగ్ తనను చూడని పిల్లలకు తన ఆస్తి ఎందుకివ్వాలి? అనుకున్నాడు. తన మరణానంతరం తన ఆస్తిని కుమారుడికి రాసేచ్చేది లేదంటూ.. తనకున్న భూమిలో ఓ స్కూల్ గానీ..ఆసుపత్రి గానీ నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆ రాష్ట్ర గవర్నర్‌కు అఫిడవిట్ దాఖలు చేశాడు. ‘ఈ వయసులో నేను నా కొడుకు, కోడలుతో కలిసి ఉండాల్సింది కానీ వారు నన్ను సరిగా చూసుకోవడంలేదు.. అందుకే ఆస్తిని సక్రమంగా వినియోగించుకునేలా గవర్నర్‌కు బదిలీ చేయాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపాడు నాథు సింగ్. అతని మనస్సు పిల్లల విషయంలో ముఖ్యంగా కొడుకు విషయంలో ఎంతగా విసిగి వేసారిపోయిందంటే తాను చనిపోయాక కూడా తన పిల్లలు తన మృతదేహాన్ని తీసుకెళ్లటానికి వీల్లేదని వృద్ధాశ్రమ నిర్వాహకులను కోరాడు. తన ఆస్తిలో కొంత డబ్బుతో సదరు ఆశ్రమమే తన అంత్యక్రియలు నిర్వహించాలని ఈ కార్యక్రమాలకు తన కొడుకు రావటానికి గానీ..కార్యక్రమాలు చేయటానికి గానీ వీల్లేదని తేల్చి చెప్పాడు.

నాథు సింగ్ ఆస్తిని ప్రభుత్వానికి ఇచ్చే విషయంలో స్థానిక సబ్-రిజిస్ట్రార్ అధికారి పంకజ్ జైన్ మాట్లాడుతూ.. ‘నాథు సింగ్ అభ్యర్థన ప్రకారం అతనికి చెందిన రూ.కోటిన్న విలువైన ఆస్తులను రిజిస్ట్రేషన్ చేశామని తెలిపారు. అతడి ఇల్లు, 10 బిగాల వ్యవసాయ భూమి కలిపితే రూ. 1.5 కోట్ల విలువ ఉంటుందని ఆ ఆస్తి,స్థిరాస్తులను అఫిడవిట్‌లో వెల్లడించారు.. ఆయన మరణానంతరం ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు.