Dairy Cattle : పాడి పశువుల్లో పాల జ్వరం… నివారణ

పశువులు ఈనిన వెంటనే కాల్షియంతో కూడిన ఇంజెక్షన్లు, ఈనే 5 రోజుల ముందు నుండి విటమిన్ డి ఇంజక్షన్లు ఇవ్వాలి. అధిక పాలిచ్చే పశువులు ఈనిన తర్వాత ప్రారంభంలో, పాలు పూర్తిగా పితకకూడదు.

Dairy Cattle : పాడి పశువుల్లో పాల జ్వరం… నివారణ

Bauffalo

Dairy Cattle : పాలిచ్చే ఆరోగ్యవంతమైన పాడి పశువుల్లో రక్తంలోని కాల్షియం పరిమాణం ఆకస్మాత్తుగా తగ్గిపోవడం, తద్వారా రక్తప్రసారంలో అంతరాయం, కండరాల బలహీనత, వెనుకకాళ్ళ పడిపోవడం, ఆపస్మారకస్థితికి లోనై మరణించడం జరుగుతుంది.  పోషక లోపం వల్ల ఇలా జరుగుతుంది. దీనినే పాలజ్వరం అని పిలుస్తుంటారు. దీనికి సకాలంలో చికిత్స అందిస్తే పశువులు బతికి బయటపడే అవకాశాలున్నాయి.

ముఖ్యముగా జఫార్ బాడి, జెర్సీ ఆవులలో ఇది ఎక్కువగా ఉంటుంది. పశువులు ఈనిన మొదటివారంలో వస్తుంది. ఈ వ్యాధి సాధారణంగా 5,10 సం.ల వయస్సున్న పాడిపశువుల్లో ఎక్కవగా వస్తుంది. వ్యాధి లక్షణాలు మూడు దశలలో ఉంటాయి. మొదటి దశలో పాలజ్వరంతో బాధపడే పాడిపశువులు ప్రారంభదశలో మేత సరిగ్గా మేయకపోవడం, నెమరు వేయకపోవడం, పళ్ళు కొరకుతూ బెదురుచూపులతో చికాకుగా ఉండి, వణకుతూ కదలలేకుంటాయి. పాలజ్వరం వ్యాధిలో పశువు జ్వరం కలిగి ఉండకుండా, వ్యాధి ప్రారంభంలో శరీర ఉష్ణోగ్రత మామూలుగా ఉండి, ఆతర్వాత సాధారణ స్థాయి కంటే తగ్గి ఒల్లంతా చల్లబడుతుంది.

తర్వాత దశలో పశువులు సరిగ్గా నిలబడలేకపోతాయి. శ్వాస, నాడి తగ్గి పశువులు కదలకుండా ఉంటాయి. ఈ స్థితిలో పాడి పశువులు తలను పొట్టపై డొక్కలో ఆనించి “S” ఆకారంలో ఉండి మగతగా పడుకుని ఉంటాయి. వ్యాధి చివరిదశలో శ్వాస, నాడివేగం పడిపోతుంది. పశువు ఒకవైపు పడిపోవడం, తద్వారా కడుపు ఉబ్బరం మొదలగు లక్షణాలు కనబడతాయి. కండరాల వణకుతో, చలనం లేకుండా, అపస్మాకర స్థితిలోకి వెత్తాయి. వైద్యసదుపాయం సత్వరమే అందకపోతే పశువులు మరణిస్తాయి.

పశువుల వంద మి.లీ.ల రక్తంలో కాల్షియం పరిమాణం 8-10.5 మి.గ్రా.లు ఉంటుంది. పాడిపశువులు, చూడి పశువులు, చూడి, అధిక పాల ఉత్పత్తి వల్ల కలిగే ఒత్తిడిలకు, శ్రమకు లోనైప్పుడు కాల్షియం 6-8 మి.గ్రా. లకు కూడా పడిపోయి పాలజ్వరం ప్రమాదం ఏర్పడుతుంది. పశువు గర్భముతో ఉన్నప్పుడు ఇచ్చే ఆహారములో కాల్షియం తక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఎండు గడ్డి పెట్టడము, గర్భస్త పశువులో అజీర్తి సమస్య ఉన్నప్పుడు పారాథైరాయిడ్ గ్రంథి పనిలోపం వల్ల ఎముకల్లో నిలువ ఉన్న కాల్షియం రక్తంలోకి త్వరగా అందకపోవడం, తద్వారా రక్తంలో కాల్షియం పరిమాణం తగ్గడం సంభవిస్తుంది. ఈనిన తర్వాత జన్నుపాల ద్వారా, మామూలు పాల ద్వారా కాల్షియం ఎక్కువగా పోతుంది. ఆసమయంలో కాల్షియం శాతం సాధారణ స్థాయి కంటే తగ్గుతుంది.

పాలజ్వరం  రోగనిర్ధారణ కాగానే కాల్షియం బోరూ గ్లూకొనేటుఇంజెక్షనును  400-800 మి.లీ. రక్తనాళాల్లోకి ఇవ్వటం ద్వారా 75 నుండి 85 శాతం పాడిపశువుల్ని రక్షించుకోవచ్చు అవసరమైతే రోజు  వ్యవధిలో మూడుసార్లు ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. పశువులు ఈనే 24 గంటల ముందు, ఈనిన తరువాత 10  గంటల తర్వాత రోజుకు మూడుసార్లు 150 గ్రా.ల కాల్షియం తాగించడం ద్వారా పాలజ్వరం రాకుండా జాగ్రత్త పడవచ్చు. చూడి, పాడి పశువులు అనవసరపు ఉద్రేకతలకు గురికాకుండా చూడాలి. దాణాలో జొన్నలు పెట్టడం మేలు.

పశువులు ఈనిన వెంటనే కాల్షియంతో కూడిన ఇంజెక్షన్లు, ఈనే 5 రోజుల ముందు నుండి విటమిన్ డి ఇంజక్షన్లు ఇవ్వాలి. అధిక పాలిచ్చే పశువులు ఈనిన తర్వాత ప్రారంభంలో, పాలు పూర్తిగా పితకకూడదు. పశువులకు తగిన వ్యాయామం కల్పించాలి. పశువులను చలినుండి సంరక్షించాలి. వ్యాధి నివారణకై అమ్మోనియం క్లోరైడ్ 25 గ్రా చొప్పున చూలి చివరి వారాల్లో అందిస్తూ, ఈనే సమయానికి 100 గ్రా. ప్రతిరోజు అందివ్వాలి. అదే సమయంలో పశువైద్యుని సంప్రదించి తగిన చికిత్స చేయించాలి.