Punjab : ముగిసిన మిల్కా సింగ్ అంత్యక్రియలు

భారత్‌ క్రీడా చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. పరుగుల శిఖరం పక్కకు ఒరిగింది. కరోనాతో మృతిచెందిన మిల్కాసింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో పరుగుల వీరుడికి తుది వీడ్కోలు పలికింది పంజాబ్‌. భారత దిగ్గజ స్ప్రింటర్‌ మిల్కాసింగ్‌కు పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్‌తో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

Punjab : ముగిసిన మిల్కా సింగ్ అంత్యక్రియలు

Milkha Singh

Milkha Singh Death News : భారత్‌ క్రీడా చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. పరుగుల శిఖరం పక్కకు ఒరిగింది. కరోనాతో మృతిచెందిన మిల్కాసింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో పరుగుల వీరుడికి తుదివీడ్కోలు పలికింది పంజాబ్‌. భారత దిగ్గజ స్ప్రింటర్‌ మిల్కాసింగ్‌కు పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్‌తో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

మే 20న కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందారు. కరోనా నెగిటివ్ వచ్చినా.. ఆయన ఆరోగ్యం మాత్రం రోజు రోజుకూ క్షీణించింది. శుక్రవారం రాత్రి ఆయన కన్నుమూశారు. పరుగులు వీరుడు మిల్కా సింగ్‌ మృతి పట్ల.. సినీ, రాజకీయ, క్రీడా రంగాల ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మిల్కా సింగ్‌ మృతి దేశానికి తీరని లోటంటూ.. అందరూ ప్రగాడ సానుభూతి తెలుపుతున్నారు.

భారతదేశ క్రీడా ఆణిముత్యంగా కీర్తి గడించిన మిల్కా సింగ్‌… 1932 నవంబర్‌ 20న పంజాబ్‌లోని గోవింద్‌పురలో సిక్‌ రాథోడ్‌ రాజపుత్రుల కుటుంబంలో జన్మించారు. దేశవిభజన సమయంలో జరిగిన అల్లర్లలో తల్లిదండ్రులను కోల్పోయారు. ఆ తర్వాత టికెట్‌ లేకుండా రైల్లో ప్రయాణించినందుకు జైలు పాలయ్యారు. అయితే.. అథ్లెటిక్స్‌పై ఇష్టం పెంచుకుని పరుగు పందాల్లో ఎన్నో అరుదైన రికార్డులు నెలకొల్పారు. 1958 జాతీయ క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించారు. 1958లో కామన్‌వెల్త్‌ పోటీల్లో అరుదైన ఘనత సాధించారు. 46.6 సెకన్లలో 440 యార్డ్స్‌ పరుగెత్తి స్వర్ణం గెలిచిన మిల్కా.. భారత్ తరఫున స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు.