Telangana
బిచ్చగాడు చనిపోయాక షాకింగ్ నిజం : గుడిసెలో డబ్బే డబ్బు.. లెక్కించడానికి 8గంటలు
అతడో బిచ్చగాడు. ఇటీవలే రైలు ప్రమాదంలో చనిపోయాడు. ఆ వ్యక్తి ఇంట్లో అతడు తప్ప ఎవరూ లేరు. దీంతో పోలీసులే అతడి అంత్యక్రియలు చేశారు. ఆ తర్వాత అతడు నివాసం ఉండే
అతడో బిచ్చగాడు. ఇటీవలే రైలు ప్రమాదంలో చనిపోయాడు. ఆ వ్యక్తి ఇంట్లో అతడు తప్ప ఎవరూ లేరు. దీంతో పోలీసులే అతడి అంత్యక్రియలు చేశారు. ఆ తర్వాత అతడు నివాసం ఉండే
Publish Date - 12:01 pm, Mon, 7 October 19
By
veegamteamఅతడో బిచ్చగాడు. ఇటీవలే రైలు ప్రమాదంలో చనిపోయాడు. ఆ వ్యక్తి ఇంట్లో అతడు తప్ప ఎవరూ లేరు. దీంతో పోలీసులే అతడి అంత్యక్రియలు చేశారు. ఆ తర్వాత అతడు నివాసం ఉండే
అతడో బిచ్చగాడు. ఇటీవలే రైలు ప్రమాదంలో చనిపోయాడు. ఆ వ్యక్తి ఇంట్లో అతడు తప్ప ఎవరూ లేరు. దీంతో పోలీసులే అతడి అంత్యక్రియలు చేశారు. ఆ తర్వాత అతడు నివాసం ఉండే గుడిసెకి వెళ్లిన పోలీసులకు దిమ్మ తిరిగింది. అతడి ఇంట్లో డబ్బే డబ్బు ఉంది. అంతేకాదు ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా దొరికాయి. వాటి మొత్తం విలువ రూ.10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు లెక్కకట్టారు. ఆ బిచ్చగాడు లక్షాధికారి అని తెలిసి పోలీసులు సహా స్థానికులు నోరెళ్లబెట్టారు. యాచకుడి దగ్గర పాన్ కార్డు, సీనియర్ సిటిజన్ కార్డు కూడా లభించాయి.
ముంబైలోని గోవండి రైల్వే స్టేషన్ దగ్గర బిర్భిచంద్ ఆజాద్(62) అనే వృద్ధుడు భిక్షాటన చేసి జీవిస్తున్నాడు. కాగా, శుక్రవారం(అక్టోబర్ 4,2019) రాత్రి రైలు పట్టాలను దాటుతుండగా ప్రమాదం జరిగింది. రైలు ఢీకొట్టడంతో చనిపోయాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆజాద్ దగ్గర పరిశీలించగా చిల్లర డబ్బుతో పాటు బ్యాంకు పాసు బుక్కులు దొరికాయి. తర్వాత గుడిసెకి వెళ్లి చూస్తే పెద్ద ఎత్తున చిల్లర నాణేలు కనిపించాయి. చిల్లర నాణెలన్నీ బకెట్లు, సంచుల్లో ఉన్నాయి. వాటిపై టార్పాలిన్ కప్పి ఉంది. ఆ చిల్లర లెక్కించడానికి 8 గంటలకు పైగానే పట్టింది. అది రూ. 1.77 లక్షలుగా తేలింది. దీంతో పాటు వేర్వేరు బ్యాంకుల్లో జమ చేసిన ఫిక్డ్స్ డిపాజిట్ మొత్తం విలువ 8 లక్షల 77వేల రూపాయలుగా గుర్తించారు. మొత్తం లెక్కకడితే రూ.10లక్షలుగా తేలింది.
బిర్బిచంద్ది రాజస్థాన్ అని అతని ఆధార్ కార్డు ద్వారా తెలిసింది. దీంతో రైల్వే పోలీసులు అతని కుటుంబ సభ్యులు లేదా బంధువులు ఎవరైనా అక్కడ ఉంటే వారికి అతని వస్తువులు, నగదును ఇస్తామని తెలిపారు. బిర్బిచంద్ ఎన్నో ఏళ్ల కిందటే ముంబైకి వచ్చి యాచకుడిగా జీవనం సాగిస్తున్నాడని స్థానికులు తెలిపారు. బిర్చిచంద్ యాచకుడు కాదు మిలియనీర్ అని తెలిసి స్థానికులు విస్తుపోతున్నారు. ఎంత డబ్బు ఉంటే ఏం లాభం.. దాన్ని ఎంజాయ్ చేయకుండానే పోయాడు పాపం.. అని జాలి చూపారు.
IPL 2021 RR Vs DC : ఉనద్కత్ దెబ్బకు ఢిల్లీ విలవిల.. రాజస్థాన్ టార్గెట్ 148
వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నాక కూడా కరోనా..ఛత్తీస్ఘడ్ హెల్త్ డైరక్టర్ మృతి
Rajasthan vs Delhi, 7th Match – టాస్ గెలిచిన రాజస్థాన్.. ఢిల్లీ బ్యాటింగ్!
IPL 2021- RR Vs DC Preview: ఎవరి బలమెంత? గెలిచేదెవరు?
కరోనాతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నుమూత
IPL 2021, RR vs Delhi: బెన్ స్టోక్స్ స్థానంలో ఎవరు?