తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటికి ఎంఐఎం పార్టీ సై అంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అమ్మ మక్కల్‌ మున్నెట్ర కలగమ్‌ పార్టీతో జట్టు కట్టాలని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ నిర్ణయించారు. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరింది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ..

MIM contest in Tamil Nadu : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటికి ఎంఐఎం పార్టీ సై అంది. దేశమంతటా పార్టీని విస్తరించే పనిలో ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ తమిళ రాజకీయాలపై గురి పెట్టారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అమ్మ మక్కల్‌ మున్నెట్ర కలగమ్‌ పార్టీతో జట్టు కట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరింది.

అమ్మ మక్కల్ మున్నెట్ర కజగమ్ అధ్యక్షుడు టీవీవీ దినకరన్‌తో ఎంఐఎం పొత్తు కుదుర్చుకుంది. పొత్తులో భాగంగా మూడు స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం నిర్ణయించుకుంది. అయితే మొదట్లో డీఎంకేతో పొత్తు కుదుర్చుకోవాలని ఎంఐఎం నిర్ణయించుకుంది. అయితే డీఎంకేతో ఇప్పటికే పయనిస్తున్న ముస్లిం నేతలు అందుకు అడ్డు తగిలారు. దీంతో ఎంఐఎం టీవీవీ దినకరన్‌ వైపు మొగ్గు చూపింది.

అయితే ఈ ఎన్నికల్లో 20 స్థానాల్లో పోటీకి దిగితే బాగుటుందని ఎంఐఎం తమిళనాడు శాఖ ఒవైసీకి ఓ రిపోర్టు ఇచ్చింది. అయితే ఎన్నికలకు తక్కువ సమయం ఉండటం ప్రధాన ద్రవిడ పార్టీలు అప్పటికే ప్రచారంలో ముందు ఉండటంతో 20 సీట్లలో పోటీపై పునరాలోచనలో పడ్డారు ఓవైసీ. చివరకు టీవీవీ దినకరన్‌తో వెళ్లాలని ఒవైసీ నిర్ణయించుకున్నారు.

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో శశికళ ప్రభావం చూపుతుందని భావించారు టీవీవీ దినకరన్‌. అయితే అనూహ్యంగా శశికళ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు టీవీవీ. అప్పటికే అన్ని పార్టీలు డీఎంకే, లేదంటే అన్నా డీఎంకేతో పొత్తులు కుదుర్చుకున్నాయి. దీంతో ఎంఐఎంతో టీవీవీ దినకరన్‌ దోస్తీ కట్టారు.