Millet Only Lunch: పార్లమెంట్‪లో మంగళవారం ‘మిల్లెట్ ఓన్లీ లంచ్’ ఏర్పాటు చేసిన కేంద్రం.. హాజరుకానున్న మోదీ

దేశంలో మిల్లెట్లకు ప్రాధాన్యం పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా వీటికి ప్రాధాన్యం ఇస్తోంది. మంగళవారం పార్లమెంట్‌లో ‘మిల్లెట్ ఓన్లీ లంచ్’ పేరిట ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. దీనికి ప్రధాని మోదీ హాజరవుతారు.

Millet Only Lunch: పార్లమెంట్‪లో మంగళవారం ‘మిల్లెట్ ఓన్లీ లంచ్’ ఏర్పాటు చేసిన కేంద్రం.. హాజరుకానున్న మోదీ

Millet Only Lunch: భారత పార్లమెంట్‌లో మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో మంగళవారం ‘మిల్లెట్ ఓన్లీ లంచ్’ ఏర్పాటు చేయనుంది కేంద్రం. అంటే మిల్లెట్లతో తయారైన ప్రత్యేక వంటకాలను పార్లమెంట్‌లో వడ్డించబోతున్నారు.

FIFA World Cup: పోలీసులపైనే దాడి చేసిన ఫుట్‌బాల్ ఫ్యాన్స్.. పలుచోట్ల రెచ్చిపోయిన ఆకతాయిలు

వచ్చే ఏడాదిని ఐక్యరాజ్య సమితి ‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్’గా ప్రకటించిన సంగతి తెలిసిందే. 2023ను అంతర్జాతీయంగా మిల్లెట్ ప్రాధాన్యం ఉన్న సంవత్సరంగా జరుపుకోబోతున్న దృష్ట్యా మిల్లెట్లకు ప్రచారం కల్పించేందుకు, వీటి ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు కేంద్రం ఈ కార్యక్రమం నిర్వహించనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. దీనిలో భాగంగా లోక్ సభ, రాజ్య సభ ఎంపీలకు మిల్లెట్లతో తయారైన ఆహార పదార్థాల్ని లంచ్‌లో వడ్డిస్తారు. అన్ని రకాల ఆహార పదార్థాల్ని మిల్లెట్లతోనే తయారు చేయనున్నారు. కర్ణాటకకు చెందిన ప్రత్యేక చెఫ్ ఆధ్వర్యంలో వీటిని తయారు చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతోపాటు, కేంద్ర మంత్రులు, ఉభయ సభలకు చెందిన ఎంపీలు హాజరవుతారు.

Karnataka: కొనసాగుతున్న కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం.. బెలగావిలో ‘మహా’ నిరసన.. 144 సెక్షన్ విధింపు

ఈ సందర్భంగా పార్లమెంట్‌లో మిల్లెట్లతో తయారు చేసిన వంటల్ని సిద్ధం చేసి అందిస్తారు. వీటిలో రాగి ఇడ్లీ, రాగి దోశ, జొన్న రొట్టె, కిచిడి, ఖీర్ వంటి ఐటమ్స్ ఉన్నాయి. మిల్లెట్ల ఉత్పత్తి, వాడాకానికి కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రత్యేక కార్యక్రమం ద్వారా దేశంలోని 14 రాష్ట్రాల్లో, 212 జిల్లాల్లో మిల్లెట్లను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రపంచంలో ఆసియా, ఆఫ్రికాలే మిల్లెట్ల ఉత్పత్తిలో ముందంజలో ఉన్నాయి. ఇండియా, నైగర్, సూడాన్, నైజీరియా దేశాలు అత్యధిక శాతం మిల్లెట్లు ఉత్పత్తి చేస్తున్నాయి. జొన్నలు, అరికెలు, సామలు, రాగులు, కొర్రలు వంటి మిల్లెట్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి. మన దేశంలో కూడా ఇటీవల వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.