చట్టాలను రద్దు చేసే ప్రశక్తే లేదన్న కేంద్రం…రైతుల కోసం వచ్చిన ఆహారాన్నే తిన్న మంత్రులు

చట్టాలను రద్దు చేసే ప్రశక్తే లేదన్న కేంద్రం…రైతుల కోసం వచ్చిన ఆహారాన్నే తిన్న మంత్రులు

Ministers Share Farmers’ Langar Food, Delivered In Van నూతన వ్యవసాయ చట్టాలపై ఇవాళ(డిసెంబర్-30,2020)ఆరోసారి ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో 40 సంఘాల రైతు నేతలతో కేంద్రం జరుపుతోంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు డిమాండ్ చేయగా… చట్టాలను రద్దు చేసే ప్రశక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది.

సమస్య పరిష్కారానికి సహేతుక నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తరపున చర్చల్లో పాల్గొన్న కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్,పియూష్ గోయల్ రైతులకు తెలిపారు.రైతులు ఆందోళన విరమించాలని కేంద్రమంత్రులు కోరారు. పంటలకు మద్దతుధరపై చర్చించేందుకు సిద్ధమని కేంద్రమంత్రులు తెలిపారు. మరోవైపు, ఆందోళన సందర్భంగా చనిపోయిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాలని చర్చల సందర్భంగా రైతులు సంఘాలు డిమాండ్ చేశాయి. రైతులు పంట వ్యర్థాలకు నిప్పుపెడితే నేరంగా పరిగణించకూడదని రైతు నేతలు డిమాండ్ చేశారు.

కాగా, చర్చల సందర్భంగా భోజన విరామసమయంలో కేంద్రం ఇచ్చిన ఆహారాన్ని రైతులు తిరస్కరించారు. గురుద్వారా బెంగ్లా సాహెబ్ మేనేజ్ మెంట్ కమిటీ.. ఓ టెంపో వ్యాన్ లో పంపించిన భోజనాన్ని రైతు నేతలు తిన్నారు. కేంద్రమంత్రులు కూడా రైతులతో కలిసి భోజనం చేశారు. రైతుల కోసం వచ్చిన ఆహారాన్నే కేంద్రమంత్రులు తిన్నారు.

అయితే, రైతులతో ప్రభుత్వం ఇప్పటివరకు ఐదు విడతలుగా చర్చలు జరిపింది. ఓసారి కేంద్ర హోం మంత్రి అమిత్​ షా సైతం కూడా చర్చలు జరిపారు. అయితే.. అన్నీ అసంపూర్తిగానే ముగిశాయి. ఇవాళ జరిగే చర్చలు కూడా విఫలమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.