ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్ గడువు పెంపు

10TV Telugu News

రైల్వే శాఖ ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. జూన్ 1 నుంచి నడిపే  ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ గడువును రైల్వే శాఖ పెంచింది. ఇప్పటి వరకు 30 రోజులు ఉండగా..దానిని 120 రోజులకు పెంచింది. 30 రాజధాని తరహా రైళ్లు, 200 ప్రత్యేక మొయిల్ ఎక్స్ ప్రెస్ రైళ్లతో పాటు  జూన్ 1 నుంచి నడిచే అన్నీ ప్రత్యేక రైళ్లకు ఇది వర్తిస్తుందని తెలిపింది. ఈ రైళ్లల్లో పార్సిల్స్, లగేజి బుకింగ్ లు కూడా అనుమతిస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.జూన్ 1 నుంచి తిరిగే  200 ప్రత్యేక రైళ్లకు సంబంధించి మే 21 నుంచి టికెట్ బుకింగ్  ప్రారంభమయ్యింది.  కేవలం రిజర్వేషన్ బోగీలతోనే ఈ రైళ్లు నడవనున్నాయి.