Minor Girl Raped : అమానుషం.. మైనర్ బాలికపై 400మంది అత్యాచారం, 6నెలలుగా దురాఘతం

బాలల దినోత్సవం వేళ ఓ మైనర్ బాలికపై జరిగిన దారుణ అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. ఈ ఘోరం యావత్ దేశాన్ని షాక్ కి గురి చేస్తోంది. ఓ మైనర్ బాలికపై ఏకంగా 400 మంది మృగాళ్లు అత్యాచారానికి..

10TV Telugu News

Minor Girl Raped : బాలల దినోత్సవం వేళ ఓ మైనర్ బాలికపై జరిగిన దారుణ అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. ఈ ఘోరం యావత్ దేశాన్ని షాక్ కి గురి చేస్తోంది. ఓ మైనర్ బాలికపై ఏకంగా 400 మంది మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆరు నెలలుగా ఆ అమ్మాయిపై సాగిన ఈ ఘోరకలి యావత్ దేశంలో సంచలనం సృష్టించింది. ఆ మృగాళ్లలో ఒక పోలీస్‌ కూడా ఉన్నాడు. లైంగిక దాడితో ఆ బాలిక గర్భం దాల్చింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఈ దారుణం జరిగింది.

బీడ్ జిల్లా అంబేజోగై తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన బాధిత బాలికది నిరుపేద కుటుంబం. బాలిక తల్లిదండ్రులు కూలీలు. రెండేళ్ల క్రితం ఆమె తల్లి చనిపోవడంతో.. కూతురిని సాకలేని తండ్రి.. ఆమె వయసును కూడా ఆలోచించకుండా బాల్య వివాహం చేశాడు. ఏడాదిన్నర పాటు అత్తారింట్లోనే ఉంది. అక్కడ ఆమెకు మామ నుంచి వేధింపులు ఎదురయ్యాయి.

Tongue Color : ఆరోగ్యాన్ని చెప్పే నాలుక రంగు..

ఏడాదిన్నరపాటు అత్తింట్లో నరకం చూసిన బాలిక చివరికి పుట్టింటికి వచ్చేసింది. అయితే, ఖాళీగా ఉండటం ఇష్టం లేక, ఏదైనా చిన్న ఉద్యోగం దొరుకుతుందనే ఆశతో ఆరు నెలల కిందట అంబేజోగై పట్టణానికి చేరుకుంది. ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అక్కడ ఓ కోచింగ్ సెంటర్ లో పని చేసే ఇద్దరు వ్యక్తులను కలిసింది. జాబ్ ఇప్పిస్తామని నమ్మించి.. ఆ ఇద్దరు ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం 6 నెలల వ్యవధిలో 400 మంది వ్యక్తులు తనను అత్యాచారం చేశారని బాలిక ఆరోపించింది.

వరుస అత్యాచారాలతో గర్భం దాల్చిన ఆమె.. తనకు న్యాయం చేయాల్సిందిగా అంబేజోగై పోలీసులను ఆశ్రయించింది. కానీ, అక్కడా తనకు అన్యాయమే జరిగిందని వాపోయింది. కేసు బుక్ చేయాల్సిన పోలీసే.. లాడ్జికి తీసుకెళ్లి రేప్ చేశాడంది. ఓవైపు కడుపులో బిడ్డ, మరోవైపు పోలీసులు కూడా న్యాయం చేయలేని దుస్థితి.. దీంతో ఆమె శిశు సంక్షేమ శాఖను ఆశ్రయించింది. చైల్డ్ వెల్ఫేర్ అధికారులు వేగంగా స్పందించి, బీడ్ జిల్లా ఎస్పీ రాజాతో మాట్లాడారు.

WhatsApp Feature: వాట్సప్‌లో కొందరికి మాత్రమే కనిపించకుండా లాస్ట్ సీన్ హైడ్ ఆప్షన్

ఎస్పీ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. బాలిక చెప్పిన ఆనవాళ్లను బట్టి ఈ కేసులో ఇప్పటిదాకా తొమ్మిది మందిని నిందితులుగా చేర్చారు. వారిలో నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరోవైపు బాలిక ఇప్పుడు 2 నెలల గర్భిణి. ఈ దారుణంతో బాలిక కుంగుబాటుకు గురైంది. దీనికి తోడు ఆమె ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అబార్షన్ చేసేందుకు శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

×