ఢిల్లీలో బాంబు పేలుడు

ఢిల్లీలో బాంబు పేలుడు

ఢిల్లీలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం సమీపంలో శుక్రవారం సాయంత్రం బాంబు పేలుడు సంభవించింది. బాంబు పేలుడులో ఎవ్వరూ గాయలపాలవ్వలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే ఇజ్రాయిల్ ఎంబసీ బయట పార్క్ చేైసి ఉన్న నాలుగైదు కార్ల అద్దాలు మాత్రం బాంబు పేలుడు ధాటికి డ్యామేజీ అయ్యాయని తెలిపారు.

బాంబు పేలుడు నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మొహరించారు.ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం,ఫైర్ బ్రిగేడ్ టీమ్ లు,ఫోరెన్సిక్ టీమ్ స్పాట్ కి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బాంబు పేలుడు జరిగిన అబ్దుల్ కలామ్ రోడ్డుని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనుమానంగా ఉన్న వాటిని పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ లను చెక్ చేస్తున్నారు.

అయితే, బీటింగ్ రిట్రీట్ కార్యక్రమానికి ప్రధాని మోడీ,రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,ఇతర ప్రభుత్వ అధికారులు,నాయకులు హాజరైన విజయ్ చౌక్ ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ పేలుడు సంభవించిడంతో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. కాగా, ఏ విధమైన మెటీరియల్ ని పేలుడుకు ఉపయోగించారన్నది ఇంకా తెలియరాలేదని సీనియర్ ఢిల్లీ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.