Minor Covid-19 Vaccine : షాకింగ్.. మైనర్‌కు కరోనా వ్యాక్సిన్, పరిస్థితి విషమం

మధ్యప్రదేశ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 16ఏళ్ల బాలుడు అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. మొరేనా జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాగ్ కా పురకు చెందిన కమలేష్

Minor Covid-19 Vaccine : షాకింగ్.. మైనర్‌కు కరోనా వ్యాక్సిన్, పరిస్థితి విషమం

Minor Covid 19 Vaccine

Covid-19 Vaccine : మధ్యప్రదేశ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 16ఏళ్ల బాలుడు అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. మొరేనా జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాగ్ కా పురకు చెందిన కమలేష్ కుష్వాహా కుమారుడు పిల్లు కుష్వాహాకి ఓ కేంద్రంలో శనివారం వ్యాక్సిన్ వేశారు. ఆ తర్వాత బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. అతడి నోటి నుంచి నురగలు వచ్చాయి. వెంటనే బాలుడిని గ్వాలియర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన అందరిని షాక్ కి గురి చేసింది. వాస్తవానికి మన దేశంలో మైనర్లకు ఇంకా టీకా కార్యక్రమం ప్రారంభం కాలేదు. అయినప్పటికీ బాలుడికి టీకా ఎలా ఇచ్చారనేది చర్చకు దారితీసింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు దర్యాఫ్తు చేపట్టారు.

మొరేనా జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రంలో బాలుడికి టీకా ఇచ్చారు. బాలుడి పరిస్థితి విషమించడంతో ముందుగా అంబాలోని ఆసుపత్రిలో చూపించారు. బాలుడి కండీషన్ చూసిన డాక్టర్లు గ్వాలియర్ లోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. బాలుడికి ఇలా అయ్యేసరికి అతడి తల్లిదండ్రులు వ్యాక్సినేషన్ కేంద్రంలో హంగామా చేశారు.

దీనిపై మొరేనా జిల్లా చీఫ్ మెడికల్, హెల్త్ ఆఫీసర్ శర్మ స్పందించారు. బాలుడు గ్వాలియర్ కు వచ్చాడో లేదో తెలుసుకునే పనిలో ఉన్నామని చెప్పారు. బాలుడు గ్వాలియర్ లోని ఆసుపత్రికి వెళ్లకుండా తిరిగి ఇంటికి వెళ్లినట్లు తమకు సమాచారం అందిందని శర్మ తెలిపారు. తమ బృందం పిల్లు ఇంటికి వెళ్లిందన్నారు. బాలుడు మూర్ఛ రోగంతో బాధపడుతున్నాడా? అని తెలుసుకునే పనిలో ఉన్నారని వివరించారు. మైనర్ కు వ్యాక్సిన్ ఎలా ఇచ్చారు అనే దానిపై విచారణకు ఆదేశించామన్నారు. బాలుడి ఆధార్ కార్డు చెక్ చేస్తామన్నారు. బాలుడి ఆధార్ కార్డు ప్రకారం అతడి వయసు 16ఏళ్లే. అతడి కార్డు మీద డేటాఫ్ బర్త్ జనవరి 1 2005గా ఉంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. 18ఏళ్లు పైబడిన వారందరికి టీకాలు ఇస్తున్నారు. ఇంకా మైనర్లకు టీకాలు అందుబాటులోకి రాలేదు. మైనర్లకు ఇచ్చే టీకాలపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కాగా, జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డి వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇటీవలే ఆమోదం తెలిపింది. ఆ వ్యాక్సిన్ ను 12ఏళ్లు పైబడిన పిల్లలకు ఇవ్వనున్నారు.