Minor Girl: పోలీసుల ఎంక్వైరీలో టార్చర్.. విషం తాగిన మైనర్ బాలిక

పోలీస్ ఎంక్వైరీలో చేసిన టార్చర్‌కు తట్టుకోలేకపోతున్నానంటూ మైనర్ బాలిక పాయిజన్ తాగేసింది. రాజ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో చేస్తున్న వినోద్ కుమార్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు....

Minor Girl: పోలీసుల ఎంక్వైరీలో టార్చర్.. విషం తాగిన మైనర్ బాలిక

Poison Suicide

Minor Girl: పోలీస్ ఎంక్వైరీలో చేసిన టార్చర్‌కు తట్టుకోలేకపోతున్నానంటూ మైనర్ బాలిక పాయిజన్ తాగేసింది. రాజ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో చేస్తున్న వినోద్ కుమార్ తన 14ఏళ్ల బాలికను వేదించిన కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు బాధితురాలి తల్లి ఆరోపిస్తుంది. బాలిక శరీరంపై ఎన్నో గాయాలు ఉన్నాయని.. తన కూతురిని శారీరకంగా టార్చర్ పెట్టారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

వెంటనే వినోద్ కుమార్ ను సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించామని సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) కేశవ్ కుమార్ తెలిపారు. ఈ విచారణను సర్కిల్ ర్యాంక్ ఆఫీసర్ కు అప్పజెప్పామని వివరించారు. బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఎస్ఐపై డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీ ఉంటుందని అన్నారు.

మైనర్ బాలికపై ఆర్మీ ఉద్యోగి కేసు పెట్టడంతోనే అసలు విచారణ మొదలైంది. తన భార్య అసభ్యకర ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుందని ఆరోపించాడు. బంధువుల అమ్మాయి అయినప్పటికీ పోలీస్ కేసు పెట్టడంతో మైనర్ బాలికను విచారణకు పిలిచారు. ఈ క్రమంలోనే తన కూతుర్ని వేధించారని, ఫిజికల్ గా టార్చర్ పెట్టారని అందుకే పాయిజన్ తాగిందంటూ బాలిక తల్లి ఆరోపిస్తుంది.

అదే రోజు డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్స్ తో పాటు, సీసీటీవీ ఫుటేజి పరిశీలించి ఇంటరాగేట్ చేస్తున్నారు.