Himachalpradesh : ప్రకృతి ఒడిలో కాలం గడిపారు.. చివరకు, మహిళా డాక్టర్ చివరి ట్వీట్ వైరల్

ఆయర్వేదిక్ డాక్టర్ దీప చివరి క్షణాల వరకు జీవితాన్ని ఆస్వాదించారు. ప్రకృతి ఒడిలో కాలం గడిపిన ఆమె...కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆదివారం హిమాచల్ ప్రదేశ్ కన్నౌవ్ జిల్లాలో సంగాల్ లోయలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో చనిపోయిన 9 మందిలో ఆమె కూడా ఉన్నారు.

Himachalpradesh : ప్రకృతి ఒడిలో కాలం గడిపారు.. చివరకు, మహిళా డాక్టర్ చివరి ట్వీట్ వైరల్

Himachal

Doctor Tweeted This Photo : జీవితం చాలా చిన్నది..ప్రతీక్షణం ఆస్వాదించాలి…అనేది పెద్దలు చెబుతుంటారు. మరణం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటి వరకు మనమధ్యనే ఉన్న వారు విగతజీవులుగా మారిపోతుంటారు. ఇలాగే జరిగింది ఆయర్వేదిక్ డాక్టర్ దీప విషయంలో. చివరి క్షణాల వరకు జీవితాన్ని ఆస్వాదించారు. ప్రకృతి ఒడిలో కాలం గడిపిన ఆమె…కానరాని లోకాలకు వెళ్లిపోయారు.

Read More : HotHit App : ఈ OTT పోర్న్ యాప్ నుంచే.. రాజ్ కుంద్రా అకౌంట్లోకి లక్షల్లో పేమెంట్స్!

ఆదివారం హిమాచల్ ప్రదేశ్ కన్నౌవ్ జిల్లాలో సంగాల్ లోయలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో చనిపోయిన 9 మందిలో ఆమె కూడా ఉన్నారు. ఆమె చివరి సారిగా చేసిన ట్విట్టర్ పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తమ ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read More : Hyderabad : గ్యాస్ సిలిండర్ కు కట్టేసి స్వర్ణకారులను చితకబాదిన గోల్డ్ వ్యాపారి

జైపూర్ కు చెందిన దీప ఆయుర్వేదిక్ డాక్టర్ గా పనిచేస్తున్నారు. ఈమె ప్రకృతి అందాలను చూసేందుకు వెళ్లారు. ప్రమాదం జరిగిన సమయానికి కంటే ముందు…మధ్యాహ్నం 12.59 గంటల ప్రాంతంలో అక్కడి కొండల్లో ఉన్న ఇండియా – టిబెట్ బోర్డర్ వద్ద దిగిన ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో ఆమె షేర్ చేశారు. 1.25 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. బస్తేరీ వద్ద సంగ్లా – చిట్కుల్ రోడ్డు మీద వెళుతున్న కార్లపై పడ్డాయి. అందులో అమె కారు కూడా ఉంది. దీంతో దీప అక్కడికక్కడనే చనిపోయారు. ఓ ప్రకృతి ప్రేమికురాలి జీవితం ముగిసిపోయింది.