Mirabai Chanu : మనసు దోచుకున్న చాను, 150 మంది డ్రైవర్లకు భోజనం.. ప్రాక్టీస్‌ షురూ, ఫోటో వైరల్‌

టోక్యో ఒలింపిక్స్ లో దేశానికి తొలిపతకం అందించిన మీరాబాయి చాను.. తన మంచి మనసు చాటుకున్నారు. శిక్షణ సమయంలో తనకు లిఫ్ట్ ఇచ్చి సాయం చేసిన 150 మంది ట్రక్ డ్రైవర్లను తన ఇంటికి పిలిచి భోజనం పెట్టారు.. ఓ చొక్కా.. మణిపురి కండువను బహుమతిగా ఇచ్చారు.

Mirabai Chanu : మనసు దోచుకున్న చాను, 150 మంది డ్రైవర్లకు భోజనం.. ప్రాక్టీస్‌ షురూ, ఫోటో వైరల్‌

Mirabai Chanu

Mirabai Chanu : 2020 టోక్యో ఒలింపిక్స్ లో దేశానికి తొలిపతకం అందించిన మీరాబాయి చాను దేశానికి తిరిగొచ్చాక బిజీ బిజీ అయిపోయారు. ఆమెను కలిసేందుకు బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. మణిపూర్ లోని సొంత ఊర్లో ఉన్న చాను ఒలింపిక్స్ గేమ్స్ విశేషాలను తోటి లిఫ్టర్లకు, తన స్నేహితులకు చెబుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి తన వంతుగా సాయం చేస్తుంది మీరా.

అకాడమీకి వెళ్లేందుకు సహకరించిన 150 మంది ట్రక్కు డ్రైవర్లను తన ఇంటికి పిలిచి భోజనం పెట్టింది. అంతేకాదు వారికి ఒక ష‌ర్ట్‌, మ‌ణిపురి కండువాను బహుమానంగా ఇచ్చి సత్కరించింది. శిక్షణా కేంద్రానికి వెళ్లేందుకు రెగ్యులర్‌గా లిఫ్ట్‌ అందించిన ట్రక్కర్లను కలిసి, వారి ఆశీర్వాదం పొందాలని కోరుకున్నానని మీరాబాయి ఈసందర్భంగా తెలిపారు. కాగా మీరాబాయి మణిపూర్ లోని నాంగ్‌పాక్ కాచింగ్ గ్రామంలో జన్మించారు.

ఆమె చిన్న తనంలో గ్రామంలోనే వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేసేవారు. ఆ తర్వాత గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలోని ఇంపాల్ కు శిక్షణ నిమిత్తం ప్రతి రోజు వెళ్లి వచ్చే వారు. అయితే ఆ ప్రాంతంలో రవాణా సౌకర్యం సరిగా లేకపోవడంతో అటుగా తిరిగే ఇసుక ట్రక్కులలో ప్రయాణించేవారు చాను. ఆలా ఆమె శిక్షణకు వెళ్లే సమయంలో ట్రక్కు ఎక్కించుకున్న వారి మేలు మరువకుండా ఇంటికి పిలిచి తనవంతు సాయం చేసింది చాను. ఇక ఇదిలా ఉంటే చాను తిరిగి ప్రాక్టీస్ లోకి వెళ్లారు. వారం రోజులపాటు కుటుంబంతో గడిపిన చాను.. మళ్ళీ బరువులు ఎత్తడం మొదలు పెట్టారు. 2022 ఆసియా గేమ్స్‌, 2024 ఒలింపిక్స్‌ మీకోసం కసరత్తు మొదలు పెట్టారు.