Madhyapradesh Crime : ముగ్గురు గ్రామస్తులు అపహరణ..కిడ్నాపర్లు డిమాండ్ చేసిన రూ.15 లక్షల కోసం ఊరు ఊరంతా చందాలు

ముగ్గురు గ్రామస్తులు అపహరణకు గురయ్యారు...కిడ్నాపర్లు డిమాండ్ చేసిన రూ.15 లక్షల కోసం ఊరు ఊరంతా చందాలు వేసుకున్నారు.

Madhyapradesh Crime : ముగ్గురు గ్రామస్తులు అపహరణ..కిడ్నాపర్లు డిమాండ్ చేసిన రూ.15 లక్షల కోసం ఊరు ఊరంతా చందాలు

Madhyapradesh..3 Villagers Kidnapping

Madhyapradesh Crime : గ్రామం అంటే కొన్ని నివాసాల సముదాయం మాత్రమే కాదు..గ్రామంలో నివసించేవారిలో ఎవరికి కష్టం వచ్చినా ‘మేమున్నాం’ అని భరోసా ఇవ్వటం అని నిరూపించారు ఓ గ్రామ నివాసులు. కనిపించకుండాపోయినవారు కిడ్నాప్ కు గురయ్యారని తెలిసి బాధితుల కుటుంబాలు హడలిపోయాయి. కిడ్నాపల్లు లక్షల రూపాయలు డిమాండ్ చేయటంతో అంత డబ్బును ఎప్పుడూ కళ్లతో కూడా చూడలేని నిరుపేదలు వారు. దీంతో లక్షల రూపాయలు ఇచ్చి తమవారిని ఎలా విడిపించుకోవాలో తెలియక తల్లడిల్లిపోయారు.వారి బాధ, ఆవేదన అర్థం చేసుకున్న మొత్తం గ్రామం అంతా ఏకమైంది. చందాలు వేసుకుని మనవారికి విడిపించుకుందాం..మనం అంతా ఒక్కటే అని నిరూపించింది. అలా రూ.15 లక్షలు చందాలు వేసుకుని తమ గ్రామస్తులను కిడ్నాపర్ల చెర నుంచి సురక్షితంగా కాపాడుకోవటానికి గ్రామం అంతా ఒక్కటైంది..తమ ఆర్థిక స్తోమతకు తగిన సహాయం చేయటానికి ముందుకొచ్చింది మధ్యప్రదేశ్ లోని షియోపూర్ లోని ఓ గ్రామం..

మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌ జిల్లాలోని విజయ్ పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోకి వచ్చే థంకర్ గ్రామానికి చెందిన రామ్‌ స్వరూప్ యాదవ్, భట్టు బఘేల్, గుడ్డా బఘేల్ అనే ముగ్గురు వ్యక్తులు సోమవారం (జనవరి 16,2023) అడవిలో పశువుల్ని మేపటానికి వెళ్లారు. వారికి కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారు. ముగ్గురు కనిపించకుండాపోవటంతో వారి కోసం ఆరా తీస్తున్న క్రమంలో రాజస్థాన్‌లోని ఓ ముఠా వారిని కిడ్నాప్ చేసినట్టు తెలిసింది. కిడ్నాపర్ల నుంచి హెచ్చరికి వచ్చింది. ఒక్కొక్కరికి రూ.5 లక్షలు మొత్తం రూ.15 లక్షలు ఇస్తేనే విడిచిపెడతామని లేకుంటే చంపేస్తామని బెదిరింపులతో కూడిన హెచ్చరికి చేశారు. దీంతో నిరుపేదలైన బాధితుల కుటుంబం తల్లడిల్లిపోయింది. అంత డబ్బు ఎక్కడనుంచి తెచ్చేది? ఎలా తమవారిని విడిపించుకునేది అని తల్లడిల్లిపోయారు.తమవారికి ప్రాణహాని జరగకూడదని దేవుడిని ప్రార్థించటం తప్ప మరేమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయారు. ఓ పక్క భయం ఎప్పుడు ఎటువంటి వార్త వినాల్సి వస్తోందోనని..ఎటువంటి భయానక దృశ్యం చూడాల్సి వస్తుందోనని..

వారి బాధను అర్థం చేసుకున్న గ్రామస్తులంతా ఏకమయ్యారు. మీకు కష్టం వస్తే మాకు వచ్చినట్లు కాదా? అని మనవారిని విడిపించుకుందాం అంటూ భరోసా ఇస్తూ ధైర్యం చెప్పారు. అంలా గ్రామస్తులంతా ఏకమై చందాలు వేసుకున్నారు. గ్రామంలో అంతా పేదలే. ఎవ్వరు ఎక్కువ డబ్బు ఇచ్చుకోలేరు. అయినా వారి ఐకమత్యం ముందు వారి సంకల్పం ముందు ఎన్ని లక్షలైనా స్వల్పమే. కానీ తమవారిని సురక్షితంగా కాపాడుకోవాలి..అదే వారు అనుకున్న నిర్ణయం. అలా తమకు తోచిన చందాలు వేసుకుని మా గ్రామస్తులను విడిపించుకుందామని నిర్ణయించుకుని డబ్బులు చందాలు వేసుకుంటున్నామని థంకర్ గ్రామస్తుడు తెలిపారు. మా గ్రామంలో అందరు పశువుల పోషణపైనే ఆధారపడి జీవిస్తుంటామని అందరూ పేదలేనని కిడ్నాప్ కు గురి అయినవారిలో ఓ వ్యక్తికి ఇంటి పైకప్పు కూడా లేదని అటువంటి పరిస్థితిలో ఉన్నవారి లక్షల రూపాయలు ఎక్కడనుంచి తీసుకొస్తారు? అందుకే గ్రామస్తులంతా చందాలు వేసుకుంటున్నామనితెలిపారు.

గ్రామస్తుల పడుతున్న టెన్షన్ గురించితెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. తమ గ్రామస్తుల క్షేమం గురించి ఊరు ఊరంతా ఏకం కావటం చూసి పోలీసులే చలించిపోయారు. వారి ఐకమత్యానికి అబ్బురపడ్డారు. అభినందించారు. కిడ్నాప్ అయినవారిని ఎలాగైనా సురక్షితంగా రక్షించి వారికి అప్పగించాలని మధ్యప్రదేశ్ పోలీసులు రంగంలోకి దిగారు. రాజస్థాన్ పోలీసులతో కలిసి కిడ్నాపర్ల కోసం గాలింపు ముమ్మరం చేశారు.

కిడ్నాపర్ల ఆచూకీ చెప్పిన వారికి తొలుత ప్రకటించిన రూ. 10 వేల రివార్డును ఇప్పుడు రూ. 30 వేలకు పెంచారు. కాగా..కొన్ని నెలల క్రితం కూడా షియోపూర్‌ లో ఇటువంటి ఘటనే జరిగింది. షియోపూర్ జిల్లాకు చెందిన ఓ రైతును దోపిడీ ముఠా కిడ్నాప్ చేసింది. డబ్బులు ఇచ్చాకే విడుదల చేసింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో దోపిడీ ముఠాల హవా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి కిడ్నాప్ లు ఆ ప్రాంతంలో సర్వసాధారణంగా జరుగుతుంటాయి.