గర్భిణీ ఆవు కిడ్నాప్.. కేసు ఫైల్ చేసిన పోలీసులు

  • Published By: Subhan ,Published On : June 14, 2020 / 12:18 PM IST
గర్భిణీ ఆవు కిడ్నాప్.. కేసు ఫైల్ చేసిన పోలీసులు

ప్రపంచం కరోనా మహమ్మారితో పోరాడుతుంది. మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ సమయంలో ప్రజలు ప్రాణాలు కాపాడుకోవాల్సింది పోయి నేరాలకు పాల్పడుతున్నారు. ముంబైలో గర్భిణీ ఆవును కిడ్నాప్ చేసుకుపోయారు. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. 

మాతుంగా పోలీస్ స్టేషన్ కు 150 మీటర్ల దూరంలో జూన్ 5 అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. వినోద్ పాండే అనే వ్యక్తి అతని తండ్రితో కలిసి సియోన్ కు దగ్గరగా ఉండే బస్తీలో ఉంటున్నాడు. మాతుంగా గుడి వద్ద ఆవులను కట్టేసి జీవనం సాగిస్తున్నారు. జూన్ 5, జూన్ 6రాత్రుల తర్వాత రెండు ఆవులు కనిపించడం లేదనే సంగతి గుర్తించారు. 

చుట్టూ పరిసరాల్లో చూసినప్పటికీ వాటి జాడ కనిపించలేదు. ముంబై పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ చేశారు. అవి జెర్సీ ఆవులని వాటి విలువ ఒక్కొక్కటి రూ.80వేల వరకూ ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీసీటీవీలను పరిశీలించి ప్రాథమిక పరీక్షలో రెండు ఆవులను టయోటా ఇన్నోవా కారులో తీసుకెళ్లినట్లు గుర్తించారు. 

ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి రెక్కీ నిర్వహించారు. రాత్రి 2గంటల 30నిమిషాల సమయంలో వారు వచ్చినట్లు తెలుస్తోంది. బైక్ నెంబర్ ప్లేట్ స్పష్టంగా లేదు. ఓ గంట తర్వాత వెహికల్ వచ్చి ఆగింది. ఆ ఇద్దరు వ్యక్తులు వాహనం వద్దకు ఆవులను నడిపించుకుంటూ వెళ్లారు. ఆ రెండింటికీ ఏదో ఇంజెక్షన్ ఇచ్చి ఇన్నోవా కారులోకి ఎక్కించారు. 

పాండే అతని స్నేహితుడితో కలిసి ఫిర్యాదు చేసేందుకు స్టేషన్కు వెళ్లడంతో పోలీసులు ప్లాట్ ఫాంపై ఆవులను ఎందుకు కటేశావని ప్రశ్నించారు. అడ్వకేట్ ధ్రుతిమాన్ జోషి చొరవ తీసుకోవడంతో కిడ్నాప్ అయిన ఆవులను వెదకడం ప్రారంభించారు పోలీసులు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాపు్తు చేప్టటారు.