Arunachal Youth : బోర్డర్‌లో మిస్సైన అరుణాచల్ యువకుడిని అప్పగిస్తానన్న చైనా..

ఇటీవల దేశ సరిహద్దుల్లో తప్పిపోయిన అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన యువకుడు చైనా ఆర్మీకి చిక్కాడు. ఇప్పుడు ఆ యువకుడిని చైనా రిలీజ్ చేసేందుకు అంగీకరించింది.

Arunachal Youth : బోర్డర్‌లో మిస్సైన అరుణాచల్ యువకుడిని అప్పగిస్తానన్న చైనా..

Missing Arunachal Youth Chi

Missing Arunachal Youth : ఇటీవల దేశ సరిహద్దుల్లో తప్పిపోయిన అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన యువకుడు చైనా ఆర్మీకి చిక్కాడు. ఇప్పుడు ఆ యువకుడిని చైనా రిలీజ్ చేసేందుకు అంగీకరించింది. అరుణాచల్ ​ప్రదేశ్​ షియాంగ్ జిల్లాలోని సియుంగ్లా ప్రాంతానికి చెందిన 17ఏళ్ల యువకుడు మిరామ్ టారోన్ ఈ నెల 18న బోర్డర్‌లో మిరామ్ టారోన్ తప్పిపోయాడు.

అయితే ఆ యువకుడు తమ భూభాగంలోకి రావడం గుర్తించినట్టు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA) తెలిపింది. దీనికి సంబంధించి భారత సైన్యానికి సమాచారం కూడా అందించింది చైనా ఆర్మీ. ఇప్పుడా విషయాన్ని రక్షణ శాఖ వెల్లడించింది. అదృశ్యమైన 17 ఏళ్ల బాలుడి విడుదలకు చైనా సూచించిందని, తేదీ, సమయాన్ని త్వరలో తెలియజేస్తామని వెల్లడించినట్టు కేంద్ర న్యాయ, న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. బాలుడిని ఎక్కడ అప్పగించనుందో ఆ ప్రదేశాన్ని సూచించినట్టు ఆయన తెలిపారు.


ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జాప్యం జరిగిందని కిరణ్ రిజుజు అన్నారు. రిపబ్లిక్ డే రోజున చైనీస్ PLAతో భారత సైన్యం చర్చించింది. PLA సానుకూలంగా స్పందించడంతో అరుణాచల్ యువకుడిని అప్పగించాలని భారత్ సూచించింది. ఎక్కడ అప్పగించాలో కూడా స్థలాన్ని సూచించింది. అయితే దీనికి సంబంధించి త్వరలో తేదీ, సమయాన్ని తెలియజేసే అవకాశం కనిపిస్తోంది. అంతకుముందు.. భారత సైన్యం తప్పిపోయిన యువకుడి ఆచూకీని గుర్తించింది. అతడి వ్యక్తిగత వివరాలు, ఫొటోలను చైనా ఆర్మీకి షేర్ చసినట్టు మంత్రి రిజుజు చెప్పారు.

సియాంగ్ జిల్లాలోని జిడో గ్రామానికి చెందిన యువకుడు మిరామ్ టారోన్ జనవరి 18, 2022 న బిషింగ్ ఏరియాలోని షియుంగ్ నుంచి అదృశ్యమయ్యాడు. అప్పటినుంచి చైనానే ఆ యువకుడిని కిడ్నాప్ చేసినట్టు వార్తలు వచ్చాయి. సెప్టెంబరు 2020లో ఇలాంటి సంఘటన జరిగింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని సుబంసిరి జిల్లా నుంచి ఐదుగురు యువకులను పీఎల్ఏ అపహరించి వారం తర్వాత వారిని విడుదల చేసింది. ఏప్రిల్ 2020 నుంచి తూర్పు లడఖ్‌లో భారత సైన్యం PLAతో ప్రతిష్టంభనలో నిమగ్నమైన సమయంలో ఈ సంఘటన జరిగింది.

Read Also : Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. దేశంలో నంబర్ వన్ రిచెస్ట్ మాన్ అతనే!