Arunachal Youth: తల్లిదండ్రుల చెంతకు చేరిన అరుణాచల్ యువకుడు “మిరమ్ తరోన్”
భారత్ లోని అరుణాచల్ నుంచి చైనా సరిహద్దు వద్ద దారి తప్పిన యువకుడు "మిరమ్ తరోన్" క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు.

Arunachal Youth: భారత్ లోని అరుణాచల్ నుంచి చైనా సరిహద్దు వద్ద దారి తప్పిన యువకుడు “మిరమ్ తరోన్” క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు. వారం కిందట భారత్ సరిహద్దు వద్ద.. యువకుడిని చైనా సైన్యం అపహరించినట్లు వచ్చిన వార్తలపై చైనా స్పందిస్తూ.. తాము ఎవరిని అపహరించలేదని స్పష్టం చేసింది. యువకుడు మిరమ్ తరోన్ ను గుర్తించిన చైనా బలగాలు అతను దారి తప్పివచ్చినట్లు నిర్ధారించారు. అనంతరం జనవరి 26న భారత్ చైనా అధికారుల మధ్య జరిగిన చర్చల మేరకు మిరమ్ తరోన్ ను అప్పగిస్తామని చైనా ప్రకటించింది.
Also read: Cyber Crime : కేవైసీ పేరుతో ఘరానా మోసం.. రూ.15లక్షలు మాయం
ఈమేరకు గురువారం ఉదయం ఇండో – చైనా సరిహద్దులోని కిబితు ప్రాంతంలో ఉన్న “వాచా-దమై ఇంటరాక్షన్ పాయింట్” వద్ద మిరమ్ తరోన్ ను చైనా ఆర్మీ అధికారులు.. భారత ఆర్మీకి అప్పగించారు. తల్లిదండ్రులను కలుసుకున్న క్షణంలో యువకుడు ఎంతో భావోద్వేగానికి గురైనట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. అంతకముందు యువకుడిని గుర్తించేందుకు అరుణాచల్ లోని ట్యూటింగ్లోని ఇండియన్ ఆర్మీ క్యాంపు వద్ద ఏర్పాటు చేసిన పరేడ్ కార్యక్రమంలో మిరమ్ తరోన్.. తండ్రి ఒపాంగ్ తరోన్, తల్లీ పాల్గొన్నారు. ఫోన్ వీడియో కాల్ ద్వారా మిరమ్ తో మాట్లాడించేందుకు ఇరు వైపులా అధికారులు ప్రయత్నించగా.. కుదరలేదు. అనంతరం టెలిఫోన్ ద్వారా మరోమారు ప్రయత్నించగా.. తల్లి మాటలు విన్న మిరమ్ తరోన్ ఉద్వేగాన్ని ఆపుకోలేక బావురమని ఏడ్చినట్లు తెలిసింది.
Also read: Bansilalpet Well : బన్సీలాల్పేటలో కళ్లుచెదిరే మెట్ల బావి.. ఔట్ స్టాండింగ్ అంటున్న సిటీ జనం
ఇక ఈవ్యవహారంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు స్పందిస్తూ..యువకుడి అప్పగింతలో సహకరించిన భారత ఆర్మీ అధికారులకు, అరుణాచల్ లోని స్థానిక భద్రత సిబ్బందికి, చైనా ఆర్మీకి కృతజ్ఞతలు తెలిపారు. మిరమ్ తరోన్ కు పూర్తి వైద్య పరీక్షల అనంతరం ఈ అప్పగింతలు జరిగినట్లు కిరణ్ రిజుజు పేర్కొన్నారు. తప్పిపోయిన యువకుడు మిరమ్ తరోన్ ను గుర్తించేందుకు అతని తల్లిదండ్రులు సహా చిన్ననాటి స్నేహితుడిని సైతం భారత అధికారులు తీసుకువెళ్లడం గమనార్హం.
The Chinese PLA handed over the young boy from Arunachal Pradesh Shri Miram Taron to Indian Army at WACHA-DAMAI interaction point in Arunachal Pradesh today.
I thank our proud Indian Army for pursuing the case meticulously with PLA and safely securing our young boy back home 🇮🇳 pic.twitter.com/FyiaM4wfQk— Kiren Rijiju (@KirenRijiju) January 27, 2022
- Rahul Gandhi: రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లారు: విదేశీ వ్యవహారాలశాఖ
- Captain Abhilasha Barak: ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్లో మొట్టమొదటి మహిళా యుద్ధ వైమానిక చోదకురాలిగా అభిలాష బరాక్
- Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం తన తోబుట్టువులకు, బంధువులకు నెల నెలా రూ.10 లక్షలు పంపాడు: ఈడీ
- Gyanvapi Temple: కాశీలో ప్రతిదీ పరమ శివుడికి చెందినదే: కేంద్ర మంత్రి
- Bihar CM Nitish: అప్పట్లో మా తరగతిలో ఒక్క అమ్మాయి కూడా లేదు: బీహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యలు
1Yasin Malik: ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నట్లు ఓఐసీ వ్యాఖ్యలు: భారత్
2US : ‘మీ భర్తను చంపడం ఎలా?’అనే..ఆర్టికల్ రాసి తన భర్తనే చంపేసిన రచయిత్రి..
3Union Home Ministry : డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్కు క్లీన్చిట్..సమీర్ వాంఖడేపై చర్యలకు కేంద్రం ఆదేశాలు
4Elon musk: ఇండియాలో టెస్లా కార్ల తయారీ కేంద్రం అసాధ్యమేనా? స్పష్టత ఇచ్చిన ఎలన్ మస్క్
5Southwest Monsoon : కేరళ వైపు పయనిస్తున్న నైరుతి రుతుపవనాలు
6జగన్ నీ పతనం మొదలైంది..!
7Boney Kapoor : బోనికపూర్ క్రెడిట్ కార్డు నుంచి 3.82 లక్షలు చోరీ.. పోయినట్టు కూడా తెలీదు..
8వైసీపీపై రామ్మోహన్ నాయుడు ప్రశ్నల వర్షం
9మహానాడు వేదికగా చంద్రబాబు సవాల్…!
10కమ్మ సామాజిక వర్గానికి దగ్గరయ్యే ప్రయత్నమా..?
-
Cyber Criminals : లోన్ ఇప్పిస్తామని రూ.40,000 కాజేసిన సైబర్ నేరగాళ్లు
-
Jalli Keerthi : ఐఏఎస్ సేవకు అందరూ ఫిదా..వరదల్లో సర్వం కోల్పోయినవారికి అండగా తెలంగాణ ఆడబిడ్డ
-
TRS : ఎన్టీఆర్కు ఘనంగా టీఆర్ఎస్ నివాళి..!
-
Unscrupulous activities : ఆంధ్రాయూనివర్శిటీలో అసాంఘీక కార్యకలాపాలు
-
Terrorists Encounter : టీవీ నటిని హత్య చేసిన ఉగ్రవాదుల హతం..హత్య జరిగిన 24 గంటల్లోనే ఎన్కౌంటర్
-
Adilabad : వేరే మతస్తుడిని పెళ్లి చేసుకుందని కూతురు గొంతు కోసి చంపిన తండ్రి
-
IPL 2022: ఆర్సీబీ కల చెదిరే.. 15 ఏళ్లుగా టైటిల్ పోరాటం.. ఈ పెయిన్ కోహ్లీకి మాత్రమే తెలుసు!
-
Minister KTR : మంత్రి కేటీఆర్ యూకే, దావోస్ పర్యటన..తెలగాంణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు