సివిల్‌ సర్వీసుల ప్రక్షాళన…”మిషన్‌ కర్మయోగి”కి కేబినెట్ ఆమోదం

  • Published By: venkaiahnaidu ,Published On : September 2, 2020 / 04:26 PM IST
సివిల్‌ సర్వీసుల ప్రక్షాళన…”మిషన్‌ కర్మయోగి”కి కేబినెట్ ఆమోదం

బుధవారం భేటీ అయిన కేంద్ర కేబినెట్​ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్ మీడియాకు వివరించారు.



“మిషన్‌ కర్మయోగి’”పేరిట సివిల్‌ సర్వీసుల ప్రక్షాళనకు ఇవాళ కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసినట్లు జవదేకర్ తెలిపారు. పౌరసేవల అధికారుల సామర్థ్యం పెంపొందించడానికి జాతీయ కార్యక్రమంగా మిషన్‌ కర్మయోగిని ప్రభుత్వం చేపడుతుందన్నారు. శ‌క్తివంత‌మైన‌ ప్ర‌జాసేవ‌కుల‌ను త‌యారు చేసే విధంగా కార్య‌క్ర‌మాన్ని రూపొందించిన‌ట్లు మంత్రి చెప్పారు.
https://10tv.in/act-of-god-coronavirus-pandemic-may-lead-to-economic-contraction-this-fiscal-says-fm-sitharaman/
మరింత సృజ‌నాత్మ‌కంగా, స‌మ‌గ్రంగా, క‌ల్ప‌నాత్మ‌కంగా, ఇన్నోవేటివ్‌గా, ప్రొఫెష‌న‌ల్‌గా, ప్ర‌గ‌తిశీలంగా, ఎన‌ర్జిటిక్‌గా, పార‌ద‌ర్శ‌కంగా, టెక్నాల‌జీ తెలిసి ఉండే విధంగా దేశ భవిష్యత్‌ కోసం సివిల్ స‌ర్వెంట్ల‌ను  దీటుగా తీర్చిదిద్దటమే మిష‌న్ ఉద్దేశ‌మ‌ని జ‌వ‌దేక‌ర్ తెలిపారు. కర్మయోగి మిషన్​ ద్వారా భార‌తీయ సాంప్ర‌దాయ పనితీరును అవ‌లంబిస్తూనే ప్రపంచ దేశాల్లో ఉన్న ఉత్త‌మ విధానాల‌ను కూడా అధికారులు అందిపుచ్చుకుంటారన్నారు.



జమ్ముకశ్మీర్​ అధికారిక భాషల బిల్లు
ఇక జమ్ము కశ్మీర్‌లో డోంగ్రి, హిందీ, కశ్మీరీ, ఉర్దు,ఇంగ్లీష్‌లను అధికార భాషలుగా గుర్తించే… .జమ్ముకశ్మీర్​ అధికారిక భాషల బిల్లు-2020కు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. జమ్ముకశ్మీర్​ ప్రజల డిమాండ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జవదేకర్ వెల్లడించారు.

మరోవైపు, జపాన్, ఫిన్‌లాండ్‌, డెన్మార్క్‌లతో వరుసగా జౌళి శాఖ, గనులు, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖల ప్రతిపాదిత మూడు ఎంఓయూలకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసిందని తెలిపారు