“మిషన్ శక్తి”పై చైనా,పాక్ రియాక్షన్ ఇదే

  • Published By: venkaiahnaidu ,Published On : March 27, 2019 / 03:26 PM IST
“మిషన్ శక్తి”పై చైనా,పాక్ రియాక్షన్ ఇదే

స్పేస్ లో భారత్ సాధించిన అరుదైన ఘనతపై చైనా,పాక్ లు స్పందించాయి. మిషన్ శక్తి పేరుతో శాటిలైట్‌ ను పేల్చేసే అరుదైన టెక్నాలజీని విజయవంతంగా భారత్ పరీక్షించిందని బుధవారం(మార్చి-27,2019) ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు.

మోడీ ప్రకటనపై చైనా స్పందిస్తూ…భారత్ ఈ పరీక్ష నిర్వహించినట్లు మాకూ తెలిసింది.అంతరిక్షంలో అన్నిదేశాలు శాంతి కొనసాగేలా చర్యలు తీసుకుంటాయని ఆశిస్తున్నాం అని ప్రకటన విడుదల చేసింది. 2007లోనే చైనా యాంటీ శాటిలైట్ మిస్సైల్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. అంతరిక్షంలో పని చేయడం మానేసిన ఓ వాతావరణ ఉపగ్రహాన్ని చైనా అప్పట్లో పేల్చేసింది. భారత్, చైనా, అమెరికా, రష్యాల దగ్గర మాత్రమే ఎ-శాట్ టెక్నాలజీ ఉంది. అయితే ఈ మిషన్ శక్తి ఎలాంటి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించలేదని మోడీ స్పష్టం చేశారు. ఏ దేశాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ పరీక్ష నిర్వహించలేదని కూడా తేల్చి చెప్పారు.

మరోవైపు పాకిస్తాన్ కూడా భారత్ ప్రకటనపై స్పందించింది. భారత్ పేరు ప్రస్తావించకుండానే…మనిషిజాతికి అంతరిక్షం కామన్ హెరిటేజ్.ఈ స్థలాన్ని సైనికీకరణ కాకుండా చేయాల్సిన బాధ్యత ప్రతిఒక్క దేశంపై ఉంది.గతంలో కొన్నిదేశాలు జరిపిన ఇదేవిధమైన సామర్ధ్యపు పరీక్షలను బలంగా ఖండించిన దేశాలు అంతరిక్షంలో సైనికీకరణ భయాలు లేకుండా కాపాడేవిధంగా కృషి చేస్తాయని ఆశిస్తున్నామని పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.