ఢిల్లీని మళ్లీ కప్పేసిన పొగమంచు

ఢిల్లీని మళ్లీ పొగమంచు దుప్పటి కప్పేసింది. కొన్నిరోజులుగా హాయిగా ఊపిరి పీల్చుకుంటున్న జనానికి పొగమంచు మళ్లీ ఉక్కిరి బిక్కిరి చేసింది.

  • Edited By: veegamteam , November 12, 2019 / 08:15 AM IST
ఢిల్లీని మళ్లీ కప్పేసిన పొగమంచు

ఢిల్లీని మళ్లీ పొగమంచు దుప్పటి కప్పేసింది. కొన్నిరోజులుగా హాయిగా ఊపిరి పీల్చుకుంటున్న జనానికి పొగమంచు మళ్లీ ఉక్కిరి బిక్కిరి చేసింది.

ఢిల్లీని మళ్లీ పొగమంచు దుప్పటి కప్పేసింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో కొన్నిరోజులుగా హాయిగా ఊపిరి పీల్చుకుంటున్న జనానికి మంగళవారం (నవంబర్ 12, 2019) ఉదయం పొగమంచు మళ్లీ ఉక్కిరి బిక్కిరి చేసింది. ఢిల్లీ, నోయిడా, గజియాబాద్, గురుగావ్ తదితర నగరాల్లో ఉదయం పొగమంచు కమ్మేయడంతో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. 

ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌లో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ సూచిక మరోసారి 450 సమీపానికి చేరుకుంది. సూచిక 376 దాటితే వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకున్నట్లు SAFAR సంస్థ పేర్కొంది. సరి-బేసి విధానం అమలు వల్ల ఫలితం కనిపించడం లేదంటున్నారు ఢిల్లీ వాసులు. పంజాబ్‌, హర్యానాలో పంట వ్యర్థాలను కాల్చడం వల్లే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిందని స్థానికుల అభిప్రాయపడుతున్నారు.