కరోనా అని పొరబడి…కుటుంబ సభ్యులకు చెప్పకుండానే యువకుడి దహనం

  • Published By: venkaiahnaidu ,Published On : June 21, 2020 / 10:00 AM IST
కరోనా అని పొరబడి…కుటుంబ సభ్యులకు చెప్పకుండానే యువకుడి దహనం

శుక్రవారం సాయంత్రం రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవలో చనిపోయిన 28 ఏళ్ళ యువకుడి మృతదేహం రాత్రికి రాత్రి హాస్పిటల్ మార్చురీ నుండి అదృశ్యమైంది. అయితే కరోనా వైరస్ బాధితుడు అని  తప్పుగా భావించి మృతదేహాన్ని దహనం చేసినట్లు అతని కుటుంబానికి తరువాత సమాచారం అందింది. ఢిల్లీ శివార్లలోని ఫరీదాబాద్‌లో ఈ ఘటన జరిగింది. 

ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఫరీదాబాద్ పోలీసు అధికారులు ఈ విషయానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. పోలీసులు తెల్పిన వివరాల ప్రకారం….సోను ఖాన్‌  అనే 28 ఏళ్ళ యువకుడిని ను శుక్రవారం 4-5 మంది వ్యక్తులు పొడిచి చంపారు. పోస్టుమార్టం అతని మృతదేహాన్ని బికె హాస్పిటల్ మార్చురీలో ఉంచారు. అయితే, శనివారం మధ్యాహ్నం ఐఓ  మరియు మృతుని  బంధువులు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి చేరుకున్నప్పుడు, మృతదేహం కనిపించట్లేదని  వారు గుర్తించారు  అని ఫరీదాబాద్ పోలీస్ PRO సుబే సింగ్ అన్నారు.

కరోనా వైరస్ రోగి అని ఆరోగ్య శాఖ అధికారులు తప్పుగా భావించడంతో మృతదేహాన్ని దహనం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి బంధువులు ఆసుపత్రి పిఎంఓ, హెల్త్ వర్కర్లపై ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంజరిగిందని సుబే సింగ్ తెలిపారు. మృతుడి కుటుంబ అభ్యర్థన మేరకు హత్య కేసును క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు. డెడ్ బాడీపై గందరగోళానికి సంబంధించి నమోదైన కేసును క్రైమ్ బ్రాంచ్‌కు కూడా బదిలీ చేశారు, ఇది ప్రతి కోణం నుండి విషయాన్ని పరిశీలిస్తున్నారు.  బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని  చెప్పారు.

మృతదేహాన్ని కరోనా వైరస్ రోగి అని తప్పుగా భావించి, దహన సంస్కారాల కోసం ఫరీదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌కు అప్పగించినట్లు అనుమానిస్తున్నాము . దీన్ని ధృవీకరించడానికి తదుపరి దర్యాప్తు జరుపుతున్నాము అని ఎస్‌జిఎం నగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్ అరవింద్ కుమార్ తెలిపారు.

అయితే  తమ ఆచారాల ప్రకారం సోనూ చివరి కర్మలు చేయలేకపోవడంపై అతడి కుటుంబ సభ్యులు,బంధువులు  ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఇప్పటికే అతని మరణంతో చలించిపోయాము, ఇప్పుడు మేము అతనిని పాతిపెట్టడానికి కూడా రాలేము. అతని పోస్టుమార్టం కూడా చేయలేదు. ఇలాంటివి ఎలా జరుగుతాయి అని మృతుడి  బంధువు అన్నారు.

Read: ఏం జరుగుతుందో చూడాలి…భారత్-చైనా సరిహద్దు టెన్షన్ పై ట్రంప్