Mixing Covid Vaccine : వేర్వేరు కంపెనీల టీకా డోసులు తీసుకోవచ్చా? ఏమవుతుంది?

కరోనా కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సినేషన్ అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశాయి. అందరికి టీకాలు ఇచ్చే కార్యక్రమం జోరుగా సాగుతోంది. అయితే, తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు తీసుకునే సమయంలో పలు సందేహాలు, అనుమానాలు కలుగుతున్నాయి. తొలి టీకా డోసు ఒక కంపెనీది, రెండో టీకా డోసు మరో కంపెనీది తీసుకోవచ్చా? వేర్వేరు కంపెనీల టీకాలు తీసుకుంటే ఏమవుతుంది? అనే ప్రశ్న కొందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనికి నిపుణులు సమాధానం ఇచ్చారు.

Mixing Covid Vaccine : వేర్వేరు కంపెనీల టీకా డోసులు తీసుకోవచ్చా? ఏమవుతుంది?

Mixing Covid Vaccine Doses

Mixing Covid Vaccine Doses : కరోనా కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సినేషన్ అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశాయి. అందరికి టీకాలు ఇచ్చే కార్యక్రమం జోరుగా సాగుతోంది. అయితే, తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు తీసుకునే సమయంలో పలు సందేహాలు, అనుమానాలు కలుగుతున్నాయి. తొలి టీకా డోసు ఒక కంపెనీది, రెండో టీకా డోసు మరో కంపెనీది తీసుకోవచ్చా? వేర్వేరు కంపెనీల టీకాలు తీసుకుంటే ఏమవుతుంది? అనే ప్రశ్న కొందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనికి నిపుణులు సమాధానం ఇచ్చారు.

వాస్తవానికి మొదటి డోసు కింద పొందిన కంపెనీ టీకానే రెండో డోసులోనూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో వాటిని కలగలిపి, రెండు వేర్వేరు సంస్థల టీకాలను పొందడమూ సురక్షితమేనని బ్రిటన్‌లో నిర్వహించిన తాజా అధ్యయనం తెలిపింది. కాకుంటే దీనివల్ల స్వల్పస్థాయిలో తలెత్తాల్సిన దుష్ప్రభావాలు.. ఒకమోస్తరు స్థాయికి పెరుగుతాయని తెలిపింది. వీటిలో చలి, అలసట, తలనొప్పి, జ్వరం వంటివి ఉంటాయంది.

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ఈ పరిశోధనను నిర్వహించింది. ఈ వివరాలు ప్రముఖ మెడిసిన్ జర్నల్ ‘లాన్సెట్‌’లో ప్రచురితమయ్యాయి. పరిశోధనలో భాగంగా వాలంటీర్లకు ఒక డోసు కింద ఆక్స్‌ఫర్డ్‌/ఆస్ట్రాజెనెకా టీకాను, మరో డోసు కింద ఫైజర్‌/బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌ను శాస్త్రవేత్తలు ఇచ్చారు. దీనివల్ల దుష్ప్రభావాలు తలెత్తినప్పటికీ అవి ఎక్కువ కాలం కొనసాగలేదని చెప్పారు. సురక్షిత ప్రమాణాలకు సంబంధించి ఇతరత్రా సమస్యలేమీ ఉత్పన్నం కాలేదని తెలిపారు.

అయితే మిశ్రమ టీకాల వల్ల ప్రజల్లో తలెత్తే సమస్యల గురించి శోధించడానికే ఈ పరిశోధన పరిమితమైనట్లు చెప్పారు. వీటివల్ల రోగనిరోధక వ్యవస్థ ఎలా స్పందిస్తుందన్నది తాము పరిశీలించలేదని వివరించారు. ‘‘మిశ్రమ డోసుల వల్ల.. టీకా పొందిన మరుసటి రోజు సదరు వ్యక్తి విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోంది. ఆరోగ్య కార్యకర్తలకు ఈ తరహాలో వ్యాక్సిన్లు ఇచ్చే ముందు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి’’ అని పరిశోధనలో పాల్గొన్న మాథ్యూ స్నేప్‌ చెప్పారు.