Hats Off Minister :ఆస్పత్రిలో ఫ్లోర్ క్లీన్ చేసిన మంత్రి గారు..ఫోటోల కోసం ఫోకస్ కోసం కాదు..

ఓ మంత్రి ఆస్పత్రిలో ఫ్లోర్ క్లీన్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైలర్ అవుతున్నాయి. ఆ మంత్రి ఏదో ఫోటోల కోసం ఈ పనిచేయలేదు. ఆస్పత్రిలో పనిచేసే స్వీపర్ రాకపోవటంతో స్వయంగా మంత్రిగారే క్లీన్ చేసే కర్ర పట్టుకుని ఊడ్చిపడేశారు.మంత్రి ఫ్లోర్‌ను శుభ్రం చేస్తున్న ఘటనకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Hats Off Minister :ఆస్పత్రిలో ఫ్లోర్ క్లీన్ చేసిన మంత్రి గారు..ఫోటోల కోసం ఫోకస్ కోసం కాదు..

Mizoram Minister Lalzirliana Moping The Floors Has Gone Viral On Social Media

Minister.. moping the floors : చిన్నపాటి కార్పొరేటర్ కూడా పెద్ద పెద్ద బిల్డప్ లు ఇస్తూ..సెక్యూరిటీ గార్డులతో హల్ చల్ చేస్తే ఈ రోజుల్లో ఓ రాష్ట్ర మంత్రి అయి ఉండీ ఏమాత్రం బేషజం లేకండా ఓ మంత్రి ఆస్పత్రిలో ఫ్లోర్ క్లీన్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైలర్ అవుతున్నాయి. ఆ మంత్రి ఏదో ఫోటోల కోసం ఈ పనిచేయలేదు. ఆస్పత్రిలో పనిచేసే స్వీపర్ రాకపోవటంతో స్వయంగా మంత్రిగారే క్లీన్ చేసే కర్ర పట్టుకుని ఊడ్చిపడేశారు.మంత్రి ఫ్లోర్‌ను శుభ్రం చేస్తున్న ఘటనకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మిజోరాం విద్యుత్ శాఖ మంత్రి ఆర్.లాల్జిర్లియానాకు, ఆయన భార్యకు, కుమారుడికి మే 8న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. ఓ ఆసుపత్రిలో మంత్రి, ఆయన భార్య ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నారు. సీఎం గానీ..మంత్రి గానీ ఆసుపత్రులకు వెళితే ఆస్పత్రి యాజమాన్యం, సిబ్బంది చేసే హడావుడి గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. కానీ మంత్రి లాల్జిర్లియాకు అటువంటి హడావుడులు నచ్చవు. సామాన్య మనిషిలాగే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన పనులు ఆయనే చేసుకుంటున్నారు.

మంత్రికి.. ఆయన భార్యకు కేటాయించిన రూమ్ శుభ్రం చేయడానికి స్వీపర్ రాకపోవడంతో ఆయనే స్వయంగా క్లీన్ చేసే కర్ర పట్టుకుని రూమ్ శుభ్రంగా చేసుకున్నారు. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. మంత్రి అయి ఉండి.. మీరే స్వయంగా శుభ్రం చేశారేంటని దానికి ఆయనే ఏమన్నారంటే..‘‘ఫ్లోర్‌ మాపింగ్ నాకు కొత్తేం కాదు..ఇదే ఫస్ట్ టైమ్ చేయలేదు. ఇంట్లో కూడా నేను చాలా సార్లు చేస్తుంటానని నవ్వుతు చెప్పారు.

డాక్టర్లను, ఆసుపత్రి సిబ్బందిని కించపరచాలన్న ఉద్దేశంతో తాను మాపింగ్ చేయలేదని..ఎవ్వరైనా సరే వారి పనులు వారే చేసుకోవాలని..అందుకే అందుకే నేను ఇలా చేశానని మంత్రి తెలిపారు. స్వీపర్‌ను పిలిచాను..కానీ చాలాసేపు చూశాను. కానీ ఎవ్వరూ రాలేదు. ఈ కరోనా సమయంలో అపరిశుభ్రంగా ఉండకూడదు. అందుకే నా రూమ్ నేనే క్లీన్ చేశానని మంత్రి లాల్జిర్లియాన తెలిపారు. కాగా..ఇదే మంత్రిగారు ఢిల్లీలోని మిజోరాం హౌస్‌ను సందర్శించినప్పుడు కూడా అక్కడ ఫ్లోర్‌ను క్లీన్ చేసి వార్తల్లో నిలిచారు.

ఇక్కడ మరో విషయం ఏమిటంటే..మిజోరాంలో చాలా మంది మంత్రులు వీఐపీ కల్చర్‌ను ఫాలో అవ్వరు. లగ్జరీగా ఉండరు. సామాన్య జీవితం గడపటానికే ఇష్టపడుతుంటారు. సామాన్య ప్రజలు ప్రయాణించే బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. సామాన్యుల ఫంక్షన్లలకు వెళతారు. అక్కడ వంటలు కూడా చేస్తుంటారు.ప్రజలతో ఎన్నుకోబడి వారి డబ్బులతో జల్సాలు చేయకూడదని వారి అభిప్రాయం. అందుకే ప్రజల్లోనే మమేకమై సాదాసీదా లైఫ్ స్టైల్‌తో జీవిస్తుంటారు. 71 సంవత్సరాల మిజోరాం మంత్రి లాల్జిర్లియానాకు, ఆయన భార్య లల్తంగ్‌మావికి మే 11న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అంతకు ముందే మే 8న ఆయన కుమారుడు కరోనా బారిన పడ్డాడు. దీంతో ఈ ముగ్గురూ హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు.

కానీ.. మే 12న లాల్జిర్లియానాకు సడెన్ గా ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ఆయనను..కుటుంబ సభ్యులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మంత్రిని రెండు రోజులు ఐసీయూలో ఉంచి చికిత్సనందించిన వైద్యులు ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో కోవిడ్ వార్డుకు తరలించారు. ప్రస్తుతం తమ కుటుంబం ఆరోగ్యంగానే ఉందని.. మెడికల్ స్టాఫ్, సిబ్బంది తమను బాగానే చూసుకుంటున్నారని మంత్రి లాల్జిర్లియానా చెప్పారు.