సిజేరియన్ ఆపరేషన్ చేసిన ఎమ్మెల్యే

  • Published By: madhu ,Published On : August 12, 2020 / 10:52 AM IST
సిజేరియన్ ఆపరేషన్ చేసిన ఎమ్మెల్యే

నేర్చుకున్న పని ఎక్కడకు పోదంటారు. కరెక్టే. డాక్టర్ గా పనిచేసిన ఓ ఎమ్మెల్యే గర్భిణీ మహిళకు సిజేరియన్ ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారు. ఈ వార్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన మిజోరాం రాష్ట్రంలో చాంపాయిలో చోటు చేసుకుంది.

ఈ ప్రాంతంలో ఇటీవలే భూకంపం సంభవించింది. ప్రజలను పరామర్శించడానికి ఎమ్మెల్యే జీఆర్ థియామ్ సంగా..అక్కడకు వెళ్లారు. ఈ సమయంలో ఓ ఇంట్లో 38 ఏళ్ల గర్భిణీ పురిటినొప్పులతో బాధ పడుతోంది. దీనిని సదరు ఎమ్మెల్యే చూశారు. అక్కడ వైద్యులు ఎవరూ లేరని తెలుసుకున్నారు.

వెంటనే రంగంలోకి దిగారు. అత్యవసరంగా ఆపరేషన్ కు అవసరమైన సామాగ్రీని తెప్పించుకున్నారు. సిజేరియన్ ఆపరేషన్ చేశారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈయన పొలిటికల్ లోకి రాకముందు..గైనకాలజీ స్పెషలిస్టుగా సేవలదించారు.