Kerala: దివంగత ఎమ్మెల్యే కొడుకుకు ఇచ్చిన ప్ర‌భుత్వ ఉద్యోగాన్ని ర‌ద్దు చేసిన హైకోర్టు

దివంగత ఎమ్మెల్యే కుమారుడికి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాన్ని కేరళ హైకోర్టు రద్దు చేసింది. ‘ఎమ్మెల్యే ప్రభుత్వ ఉద్యోగి కాదు’ అని వ్యాఖ్యానించింది.

Kerala: దివంగత ఎమ్మెల్యే కొడుకుకు ఇచ్చిన ప్ర‌భుత్వ ఉద్యోగాన్ని ర‌ద్దు చేసిన హైకోర్టు

Kerala High Court (1)

Kerala High court : ఎమ్మెల్యే కొడుకుకు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని కేరళ హైకోర్టు రద్దు చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యే ప్రభుత్వ ఉద్యోగి కాదని స్పష్టం చేస్తు..సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ నిర్ణ‌యాన్ని హైకోర్టు తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. దివంగ‌త ఎమ్మెల్యే కుమారుడికి ఇచ్చిన ప్ర‌భుత్వ ఉద్యోగాన్ని హైకోర్టు ర‌ద్దు చేస్తూ శుక్రవారం (డిసెంబర్ 3,2021) తీర్పు వెల్ల‌డించింది. ఎమ్మెల్యే ప్ర‌భుత్వ ఉద్యోగి కాదు అంటూ స్ప‌ష్టం చేసింది.

Read more : Supreme Court : పెద్దలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు..మరి పిల్లలెందుకు స్కూలుకు వెళ్లాలి? సుప్రీంకోర్టు

2016 ఎన్నిక‌ల్లో చెంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి కేర‌ళ అసెంబ్లీకి వామపక్ష (CPI-M)పార్టీ నుంచి కేకే రామ‌చంద్ర‌న్ నాయ‌ర్ ఎన్నిక‌య్యారు. ఆ తరువాత అనారోగ్యంతో 2018లో రామ‌చంద్ర‌న్ క‌న్నుమూశారు. దీంతో ఆయ‌న కుమారుడు ఆర్ ప్ర‌శాంత్‌కు ప్రభత్వం ప‌బ్లిక్ వ‌ర్క్స్ డిపార్ట్‌మెంట్ లో అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగం క‌ల్పించింది. ఇది పలు విమర్శలకు దారి తీసింది. ఎమ్మెల్యే కుమారుడికి ఉద్యోగం ఇవ్వ‌డంపై కేర‌ళ సీఎం తీవ్ర విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్నారు. పాలక్కడ్ కు చెందిన అశోక్ కుమార్ అనే న్యాయ‌వాది హైకోర్టులో పిటీషన్ వేశారు.

Read more : Viral Video : ఫైల్స్ పట్టుకుపోయి..ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు చెమ‌ట‌లు పట్టించిన మేక..

దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు శుక్ర‌వారం తుదితీర్పు వెల్ల‌డిస్తు ఎమ్మెల్యే ప్రభుత్వం ఉద్యోగి కాదని..అతని కుమారుడికి ఇచ్చిన ప్రభుత్వం ఉద్యోగం నుంచి రద్దు చేయాలని తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా కోర్టు ‘ఎమ్మెల్యే ప్ర‌భుత్వ ఉద్యోగి కాదు..ఐదేళ్ల పాల‌న కోసం ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డిన ప్ర‌జాప్ర‌తినిధి మాత్ర‌మే’ అని కోర్టు త‌న తీర్పులో స్పష్టంచేసింది. ఎమ్మెల్యేల కుమారుల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇవ్వ‌డం స‌రైంది కాదు అని సూచించింది. తీర్పులో భాగంగా ప్రభుత్వం ఉద్యోగం పొందిన దివంగత ఎమ్మెల్యే రామచంద్రన్ నాయర్ కుమారుడు ప్ర‌శాంత్ పోస్టింగ్‌ను ర‌ద్దు చేసిన‌ట్లు కోర్టు స్ప‌ష్టం చేసింది.