కరోనా వచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యే భార్యకే బెడ్ దొరకలేదు

కరోనా వచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యే భార్యకే బెడ్ దొరకలేదు

Mla Ram Gopal Lodhi Claim His Wife Sandhya Lodhi Not Get Treatment In Sn Agra

MLA Wife: కరోనా కారణంగా డబ్బు ఉన్నవాళ్లు.. లేనివాళ్లు అనే తేడా లేకుండా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కరోనా వైరస్ ప్రభావితమైన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి కాగా.. ఈ రాష్ట్రంలో ఆరోగ్యసేవలు ప్రభుత్వం అదుపులో కూడా లేవు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో రోగులు నిండిపోయారు. రోగుల చికిత్స కోసం అవసరమైన మందులు ఆసుపత్రుల్లో దొరకట్లేదు.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? అధికార పార్టీ ఎమ్మెల్యే సైతం తన భార్యకు చికిత్స అందట్లేదని, బెడ్ దొరకట్లేదని, ఒక వీడియోలో తన బాధను వివరించగా.. ఇప్పుడు ఆ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేకే ఇటువంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని విమర్శిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలోని జస్రానాకు చెందిన బిజెపి ఎమ్మెల్యే రామ్ గోపాల్ అలియాస్ పప్పులోధికి ఏప్రిల్ 30న వ్యాధి సోకింది. రామ్ గోపాల్‌తో పాటు, అతని భార్య సంధ్య లోధికి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. రామ్‌గోపాల్‌ను జిల్లాలోని ఐసోలేషన్ వార్డులో చేర్చారు. రామ్ గోపాల్ కోలుకున్న తరువాత, ఐసోలేషన్ వార్డ్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే, భార్య ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీకి పంపించారు.

అయితే, అక్కడ తన భార్యకు మెడికల్ కాలేజీలో బెడ్ కూడా ఇవ్వలేదని, “మూడు గంటలు నేలపై ఉంచారు” అని బిజెపి ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. తన భార్య పరిస్థితి కూడా డాక్టర్లు చెప్పడం లేదని వీడియోలో ఆరోపించారు. ఆహారం, నీరు కూడా ఇవ్వడం లేదు. అధికారులు, వైద్యులు ఏమీ చేయట్లేదని ఎమ్మెల్యే చెప్పారు.