MLA with underwear : ఎమ్మెల్యేకు‘ఆపుకోలేనంత కష్టం’అండర్ వేర్ తో రైల్లో హల్ చల్..

ఓ ఎమ్మెల్యే రైల్లో ప్రయాణిస్తుండగా ఆపుకోనంత కష్టం వచ్చింది. దీంతో పైజమా కుర్తా విప్పేసి బాత్రూమ్ కు పరుగులుపెట్టారు. దీంతో పెద్ద గొడవే జరింగింది..

MLA with underwear : ఎమ్మెల్యేకు‘ఆపుకోలేనంత కష్టం’అండర్ వేర్ తో రైల్లో హల్ చల్..

Mla Runs In The Train With The Underwear.

mla runs in the train with the underwear : ఆయనో ఎమ్మెల్యే. రైల్లో ప్రయాణిస్తుండగా ‘ఆపుకోలేని కష్టం’ వచ్చింది. చిన్నపిల్లాడికి కూడా రాకూడని కష్టం వచ్చింది. ఈక్రమంలో జరిగిన ఘటన గురించి చెప్పుకోలేక సదరు ఎమ్మెల్యే బనియన్ అండర్ వేర్ తో రైల్లో తిరగాల్సి వచ్చింది. రైల్లో అండర్ వేర్ బనీనుతో తిరుగుతున్న అతన్ని చూడలేని తోటి ప్రయాణీకులు అతనితో వాదం పెట్టుకున్నారు? ‘‘ఏంటిది ఇంతమందిలో ఇలా తిరుగుతున్నారు? ఆడవాళ్లు, పిల్లలు ఉన్నారు? బట్టలు వేసుకోండి’’ అని మందలించారు. కానీ సదరు ఎమ్మెల్యే పరిస్థితి ఎలా తయారైందంటే..బట్టలు వేసుకోలేడు..అలాగని అలా తిరగనూలేడు..ప్రయాణీలు మాట్లాడే మాటలు భరించలేక..బట్టలు ధరించలేక ఆ ఎమ్మెల్యే..తన రివాల్వర్ తీసి కాల్చుతానని బెదిరింపులకు పాల్పడ్డే పరిస్థితి వచ్చింది. రెండు రోజుల కిందట పాట్నా-ఢిల్లీ తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైల్లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ లో బీహార్ ఎమ్మెల్యేకు వచ్చిన దుస్థితి వివరాల్లోకి వెళితే..

ఆ ఎమ్మెల్యే పేరు ‘గోపాల్‌ మండల్‌’బిహార్‌లో జేడీయూ పార్టీ ఎమ్మెల్యే.రెండు రోజుల కిందట పాట్నా-ఢిల్లీ తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైల్లో ఎమ్మెల్యే గోపాల్ ప్రయాణిస్తున్నారు. ఆయనకు ‘కడుపులో గడబిడ’ మొదలయ్యింది.‘ఆపుకోలేనంత కష్టం’ రావడంతో కూర్చున్న చోటే కుర్తా, పైజామా తీసేసి లో దుస్తులతో (బనియన్, అండర్ వేర్) బాత్‌రూమ్‌కి పరుగులు పెట్టాల్సి వచ్చింది.ఆయాసపడుతూ టాయిలెట్‌లోకి వెళ్లే క్రమంలో గోపాల్‌ను చూసిన ఓ ప్రయాణీకుడు ‘ఇదేమిటీ అసహ్యంగా..’ అంటూ ప్రశ్నించాడు. అతడిని పట్టించుకునే పరిస్థితిలో లేని ఎమ్మెల్యే అదే వాయు వేగంతో బాత్రూమ్ పరుగెట్టాడు. బాత్రూమ్ లో పని ముగించుకుని ప్రశాంతగా బయటకు వచ్చిన ఎమ్మెల్యే..అలాగే బనియన్, డ్రాయర్ తోనే.. ‘ఇంతకు ముందు నన్ను ప్రశ్నించిన ఆ వ్యక్తి ఎక్కడ’ అని ఆరా తీశారు. ఎమ్మెల్యేనే అడ్డుకుంటావా? అంటూ అతడితో గొడవకు దిగి విసురుగా నెట్టేశాడు.

దీంతో తోటి ప్రయాణీకులు కూడా ఎమ్మెల్యే వాలకం చూసి చిరాకు పడ్డారు. ఇలా వాగ్వాదం పెరిగింది. దీంతో ప్రయాణీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఎమ్మెల్యే గోపాల్ మండల్ మద్యం సేవించి బనియన్, అండ్‌వేర్‌తో రైలు భోగిలో తిరిగారు.. దీనిని ప్రశ్నించినందుకు నాపై దాడి చేశారు.. మెడలో గొలుసు, చేతి ఉంగరం లాగేసుకుని దురుసుగా ప్రవర్తించారు’ అని పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఆరోపించారు.

ఇది వివాదాస్పదం కావడంతో ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. తాను గొడవ పడ్డ ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పారు. అనంతరం తాను ఎందుకు అలా బాత్రూమ్ కు వెళ్లాల్సి వచ్చిందో వివరించారు. నేను అర్జంట్ గా బాత్రూమ్ కు వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో ఓవ్యక్తి నన్ను ప్రశ్నించటంతో నాకు కోపం వచ్చి అలా ప్రవర్తించానని వివరణ ఇచ్చి ఆఖరికి క్షమాపణ చెప్పారు.