Firing On MLA: ఎమ్మెల్యే బృందంపై కాల్పులు.. పరుగులు పెట్టిన సిబ్బంది

దురాక్రమణలను పరిశీలించడానికి వెళ్లిన ఎమ్మెల్యే బృందంపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడగా ఇద్దరు రిపోర్టర్లకు గాయాలయ్యాయి. అస్సాం రాష్ట్రంలో చోటుచేసుకుంది.

Firing On MLA: ఎమ్మెల్యే బృందంపై కాల్పులు.. పరుగులు పెట్టిన సిబ్బంది

Firing On Mla

Firing On MLA: దురాక్రమణలను పరిశీలించడానికి వెళ్లిన ఎమ్మెల్యే బృందంపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడగా ఇద్దరు రిపోర్టర్లకు గాయాలయ్యాయి. అస్సాం రాష్ట్రంలో చోటుచేసుకుంది. అస్సాం, నాగాలాండ్ సరిహద్దు జోర్హాట్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఇది జరిగింది. బుల్లెట్ల శబ్దం విని ఎమ్మెల్యే పరుగులు పెట్టారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అస్సాం జిల్లాలైన చారిడియో, శివసాగర్, జోర్హాట్, గోలఘాట్, కర్బి అంగ్లాంగ్​లు నాగాలాండ్‌తో సరిహద్దును కలిగివున్నాయి. ఈ సరిహద్దుల్లో నాగాలాండ్ దురాక్రమణలకు పాల్పడుతుందని తెలియడంతో మరియాని ఎమ్మెల్యే రూప్ జ్యోతి కుర్మి తన సిబ్బంది, కొందరు మీడియా ప్రతినిధులతో కలిసి దేసో వ్యాలీ రిజర్వ్ ఫారెస్ట్​కు వెళ్ళాడు. ఎమ్మెల్యే బృందం దురాక్రమణలను పరిశీలిస్తున్న సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

కాల్పుల శబ్దం విన్న ఎమ్మెల్యే బృదం పరుగులు తీసింది. ఈ ఘటనపై ఎమ్మెల్యే మాట్లాడుతూ అదృష్టవశాత్తు తామంతా కాల్పుల నుంచి తప్పించుకున్నామని తెలిపారు. ఇద్దరు మీడియా ప్రతినిధులకు గాయాలు అయ్యాయని వారిని వెంటనే ఆసుపత్రిలో చేర్చామని తెలిపారు. ఇక ఈ ఘటనపై అస్సాం సీఎం హిమంత బిశ్వాశర్మ స్పందించారు. అక్కడి పరిస్థితిని పరిశీలించాలని సీనియర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో పెద్ద సంఖ్యలో పోలీస్ బలగాలు ఘటన స్థలికి చేరుకున్నాయి.