Manipur: బీజేపీ ప్రభుత్వ నిర్ణయంపై గిరిజనుల ఆగ్రహం.. ఏకంగా సీఎం పాల్గొనే సమావేశానికే నిప్పు, ఉద్రిక్త పరిస్థితులు

ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అడ్డుకునేందుకే ప్రభుత్వంపై సహాయ నిరాకరణోద్యమాన్ని చేపట్టాల్సి వచ్చిందని గిరిజన ఫోరం తెలిపింది. ఇక శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి జిల్లాలో ఎనిమిది గంటల పాటు సమ్మెకు పిలుపునిచ్చింది.

Manipur: బీజేపీ ప్రభుత్వ నిర్ణయంపై గిరిజనుల ఆగ్రహం.. ఏకంగా సీఎం పాల్గొనే సమావేశానికే నిప్పు, ఉద్రిక్త పరిస్థితులు

Manipur

Manipur: మణిపూర్ ముఖ్యమంత్రి ఎన.బీరెన్ సింగ్ పాల్గొనబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రాంగణానికి నిరసనకారులు నిప్పు పెట్టారు. చురాచందపూర్ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిందీ దారుణం. ముఖ్యంత్రి ఈరోజు జిమ్ కమ్ క్రీడా సౌకర్యాలను ప్రారంభించాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి కార్యక్రమానికి ముందే నిరసనకారులు నిప్పు పెట్టడంతో ముఖ్యమంత్రి కార్యక్రమం రద్దైంది. నిరసనకారులు ఆదివాసి గిరిజన ఫోరంకి చెందిన వారు. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చిత్తడి నేలలతో పాటు రిజర్వ్ చేయబడిన, రక్షిత అటవీ ప్రాంతాలను సర్వే చేయడంపై ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Maharashtra Politics: తాను కూడా రాజ్ థాకరేలాగే అన్న అజిత్ పవార్.. కొంపదీసి కొత్త పెడతారా ఏంటి?

అంతే కాకుండా రాష్ట్రంలోని చర్చిలను బీజేపీ ప్రభుత్వం కూల్చుతోందని ట్రైబల్ లీడర్స్ ఫోరం ఆరోపిస్తోంది. మణిపూర్ ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో రాష్ట్రంలో మూడు చర్చిలను కూల్చివేసింది. ఇక తాజా దుర్ఘటన అనంతరం చురచందపూర్ ప్రాంతంలో 144వ సెక్షన్‭ను విధించారు. అలాగే అన్ని ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఆందోళనకు దిగిన నిరసనకారులు వేదిక లోపల కుర్చీలు, ఇతర వస్తులు పగలగొట్టడం వీడియోల్లో రికార్డైంది. కొత్తగా నిర్మించిన జిమ్‌లోని క్రీడా సామగ్రి మొత్తాన్ని తగలబెట్టారు. స్థానిక పోలీసులు వెంటనే చర్యకు దిగారు. నిరసనకారులను అక్కడి నుంచి చెదరగొట్టారు. వేదిక అప్పటికే వందలాది కుర్చీలతో ధ్వంసమైంది. పరిస్థితి అదుపు తప్పడంతో, చురచంద్‌పూర్ పరిపాలన జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేసింది. అయినప్పటికీ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Nepal Earthquake: నేపాల్‭ను వణికించిన వరుస భూకంపాలు

శుక్రవారం మధ్యాహ్నం బీరేన్ సింగ్ ప్రారంభించనున్న న్యూ లాంకాలోని పిటి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను నిరసనకారులు తగలబెట్టారని పోలీసులు స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అడ్డుకునేందుకే ప్రభుత్వంపై సహాయ నిరాకరణోద్యమాన్ని చేపట్టాల్సి వచ్చిందని గిరిజన ఫోరం తెలిపింది. ఇక శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి జిల్లాలో ఎనిమిది గంటల పాటు సమ్మెకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని గిరిజనుల పట్ల సవతి తల్లి వైఖరిని ప్రదర్శిస్తోందన్న ఆరోపణలతో కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కూడా ఫోరమ్‌కు మద్దతు పలికింది.